కేంద్ర మాజీ హోంమంత్రిపై కేసు నమోదు
లక్నో: పార్లమెంటు దాడుల ఘటనపై అఫ్జల్ గురు ఉరితీతకు ముందు విచారణ సరిగా జరపలేదన్న ఆరోపణలతో కాంగ్రెస్ సీనియర్ నేత, అప్పటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరంపై కేసు నమోదు అయింది. లాయర్ వినయ్ కుమార్ అప్పటి ఘటనపై ఫిర్యాదుచేశారు. యూపీ లోని మహారాజ్ గంజ్ కోర్టు ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టింది. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీయ విషయంలో అంతకుముందు జరిగిన దర్యాప్తులలో విచారణలో లోపాలు తలెత్తాయని ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ రాజద్రోహానికి పాల్పడలేదని, జాతి వ్యతిరేక నినాదాలు చేయలేదని చెప్పిన చిదంబరం, వారు స్టుపిడ్ పని చేశారంటూ చెప్పిన వ్యాఖ్యలు చాలు కేంద్ర మాజీ హోంమంత్రిపై చర్యలు తీసుకోవడానికి అని పేర్కొన్నారు. మహారాజ్ గంజ్ కోర్టు ఏప్రిల్ 11న తదుపరి విచారణ జరుగుతుందని వెల్లడించింది. 2001 పార్లమెంట్ దాడుల కేసులో మాస్టర్ మైండ్ అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి9న ఢిల్లీలోని తీహార్ సెంట్రల్ జైలులో ఉరితీసిన విషయం తెలిసిందే.