యూపీలో బీజేపీ తొలి జాబితా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు బీజేపీ 149 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి లక్ష్మికాంత్ వాజ్‌పేయి, మరో మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మనవడు, పార్టీ జాతీయకార్యదర్శి శ్రీకాంత్ శర్మ తదితరులకు జాబితాలో చోటు దక్కింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జేపీ నడ్డా ఈ జాబితాను సోమవారం విడుదల చేశారు. మొత్తం 403 శాసనసభ స్థానాలుండగా వీటిలో అధిక శాతం సీట్లకు పోలింగ్ తొలి రెండుదశల్లోనే ఉండనుంది. 2002లో యూపీలో అధికారానికి దూరమైన బీజేపీ.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చకోవడం సహా గెలవడానికి అనేక మార్గాలను అనుసరిస్తోంది