సోనేభాద్ర: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేశారు. ఉత్తరప్రదేశ్ వాసులు దత్తపుత్రుడిని(ప్రధాని నరేంద్రమోదీ)ని తిరిగి గుజరాత్ పంపిచేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. తమ సొంత కూతురు(మాయావతి) చేతుల్లోనే అధికారం పెడుతున్నారని చెప్పారు.
బీజేపీకి ఆమె కొత్త నిర్వచనం చెప్పారు. బీజేపే అంటే భారతీయ జనతా పార్టీ కాదని, భారతీయ జుమ్లా పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. నల్లధనం తీసుకొస్తామని, రూ.15 లక్షలు ప్రతి సామాన్యుడి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పి ఆ హామీ కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. తన హామీలు నెరవేర్చలేకనే ఆ వైఫల్యాలు వేరే వారికి తెలియకుండా ఉండేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజల దృష్టిని మరల్చారని మండిపడ్డారు.
‘దత్తపుత్రుడు ఇంటికి.. కూతురుకే అధికారం’
Published Wed, Mar 1 2017 8:17 PM | Last Updated on Thu, Jul 11 2019 7:36 PM
Advertisement
Advertisement