న్యూఢిల్లీ : లోక్సభ సోమవారం జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. హైదరాబాద్పై గవర్నర్కు ప్రత్యేక అధికారాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. గవర్నర్ గిరి వద్దంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు.
కాగా సోమవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అంతకు ముందు గవర్నర్కు అధికారాలపై టీఆర్ఎస్ ఎంపీలు సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే ఎంపీల నిరసనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ ఎంపీల నిరసనల మధ్య రాజ్యసభ కూడా పది నిమిషాలు వాయిదా పడింది. డబ్ల్యూటీవోపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఎంపీలు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో రాజ్యసభను ఛైర్మన్ వాయిదా వేశారు.
లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
Published Mon, Aug 11 2014 11:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement
Advertisement