మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగ ఉత్పత్తులను భారత్‌లో
న్యూఢిల్లీ: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగ ఉత్పత్తులను భారత్‌లో తయారుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్న సంస్థలు ఆ సాంకేతికతపై తమకే పూర్తి హక్కులు ఉండాలని కోరుతున్నాయి. ఇందుకుకోసం రక్షణ మంత్రికి ఆగస్టులో ఓ లేఖ రాశాయి. స్థానిక భాగస్వాములతో కలసి ఉత్పత్తి చేసిన పరికరాల్లో ఏవైనా లోపాలు తలెత్తితే వాటిని తమ తప్పుగా చూడకూడదన్నాయి.
భారత సైన్యానికి యుద్ధ విమానాలను తయారుచేసేందుకు లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ విమానాలు ఆసక్తి చూపుతున్నాయి. భారత్ కనీసం 100 సింగిల్ ఇంజిన్ ఎఫ్–16 విమానాలను కొంటామంటే తమ ఉత్పత్తి కేంద్రాన్ని అమెరికా నుంచి భారత్‌కు మారుస్తామని లాక్‌హీడ్ ప్రకటించింది. అయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ సంస్థలు ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభిస్తే ఆ సాంకేతికత మనకు లభిస్తుందనేది ప్రధాని మోదీ ఆలోచన.