డెహ్రాడున్: ప్రపంచాన్ని విషమ పరిస్థితుల్లోకి నెట్టిన కరోనా ప్రస్తుతం విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 7,87,225 కేసులు నమోదు కాగా 37,843 మంది మృతి చెందారు. సుమారు 200 దేశాలు దీని బారిన పడ్డాయి. దీంతో కరోనాతో పోరాడేందుకు ప్రజలు తమకు తోచిన విరాళాలు అందిస్తూ ప్రభుత్వాలకు మద్దతుగా నిలుస్తున్నారు. సామాన్య జనం నుంచి సెలబ్రిటీల దాకా, క్రీడాకారుల నుంచి పారిశ్రామిక వేత్తల దాకా అందరూ మేము సైతం అంటూ ముందుకు వచ్చి తమ ఉదారతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన ఐదు నెలల జీతాన్ని సీఎం సహాయనిధికి అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. కాగా ఇప్పటికే ఆయన భార్య లక్ష రూపాయలు విరాళమందించగా, కుమార్తెలు రూ.52 వేల సాయం అందించారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. (ఉత్తరాఖండ్ సీఎం విచిత్ర వ్యాఖ్యలు..!)
Comments
Please login to add a commentAdd a comment