ఆ 9మంది ఎమ్మెల్యేలకు చుక్కెదురు | Uttarakhand high డourt says 9 rebel డongressmen remain disqualified | Sakshi
Sakshi News home page

ఆ 9మంది ఎమ్మెల్యేలకు చుక్కెదురు

Published Mon, May 9 2016 10:27 AM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

ఆ 9మంది ఎమ్మెల్యేలకు చుక్కెదురు - Sakshi

ఆ 9మంది ఎమ్మెల్యేలకు చుక్కెదురు

ఉత్తరాఖండ్: అనర్హత వేటు పడిన 9మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు అయింది. తమపై స్పీకర్ వేసిన అనర్హతను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఉత్తరాఖండ్ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దీంతో మంగళవారం జరిగే బలపరీక్షలో ఈ తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు.

న్యాయస్థానం తీర్పుతో  కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించినట్లు అయింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో రేపు హరీశ్ రావత్ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం అవుతున్నారు. ఇక  హైకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. హరీశ్ రావత్ నివాసం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement