
ముంబై : దిశ హత్యాచార ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పాతతరం నటి వహీదా రెహమాన్ నిందితుల ఎన్‌కౌంటర్ సరైంది కాదని వ్యాఖ్యానించారు. లైంగిక దాడి హేయమైందని, క్షమించరాని నేరమని అంటూ నిందితుడికి యావజ్జీవ ఖైదు విధించాలని, మరణ శిక్ష తగదని అభిప్రాయపడ్డారు. ఓ వ్యక్తిని చంపడం మన చేతుల్లో ఉండరాదని, లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు విధించాన్నదే తన ఉద్దేశమని ఆమె వ్యాఖ్యానించారు.
నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సందర్భాల్లో కేసు నమోదు చేయరాదని అన్నారు. నిందితులు నేరానికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే కేసు ఎందుకు నమోదు చేస్తారని, అది ప్రజా ధనం వృధా చేయడమేనని 81 సంవత్సరాల వహీదా రెహమాన్ పేర్కొన్నారు. ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న నటి ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment