Waheeda Rehman
-
భార్య కోసం ప్రేమను త్యాగం చేసిన స్టార్ హీరో
గురుదత్ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమాపై ఏ టాక్ పూర్తి కాదు . హిందీ చలనచిత్ర చరిత్రలో దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా త్రిపాత్రాభినయంతో మెప్పించాడు. ఇండియన్ సినిమాపై చెరగని ముద్రవేసి చిరు ప్రాయంలోనే (39 ఏళ్లు) నిజ జీవిత చిత్రం నుంచి తెరమరుగైన గురు దత్‌ను ఇప్పటికీ గుర్తు చేసుకునే వారు ఉంటారంటే ఏం ఆశ్చర్యం కలుగదు. 1957లో విడుదలైన గురుదత్ మాస్టర్ పీస్ ‘ప్యాసా’. ఇప్పటి వారికి ఆ సినిమా పెద్దగా పరిచయం ఉండదు కానీ అప్పట్లో అదొక సంచలనం. హీందీ ఆల్-టైమ్ 100 ఉత్తమ చలనచిత్రాల జాబితాలో ప్యాసా ఉండటంలో ఆశ్చర్యం లేదు.ఆయన జీవితంలో పెళ్లి, ప్రేమ రెండూ ప్రత్యేకమే.. (గురుదత్- వహీదా రెహమాన్) వహీదా కోసం హీరోగా మారిన గురుదత్ ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా..’ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటి వహీదా రెహమాన్. 1955లో ‘రోజులు మారాయి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఆమె దర్శకుడు గురుదత్ దృష్టిలో పడింది. ఆమె అందానికి, నటనకి ఫిదా అయిన గురుదత్ ‘సీఐడీ’ అనే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. అలా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వహిదా. 1956లో విడుదలైన ఆ చిత్రం..అప్పటికి అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కింది. వహిదా అందానికి ముగ్ధుడైన డైరెక్టర్ గురుదత్ ఆమె కోసం హీరోగా అవతారమెత్తాడు. వహిదా కోసం ‘ప్యాసా’ చిత్రంలో కూడా హీరోగా నటించాడు. వాస్తవానికి తొలుత ఆ సినిమాకు హీరో దిలీప్ కుమార్. అయితే వహిదా రెహమాన్ హీరోయిన్గా చేస్తుందని తెలియడంతో దిలీప్ని తప్పించి తనే హీరోగా నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వహిదాకి గురుదత్ క్లోజ్ అయ్యాడు. తొలుత ఇద్దరి మంచి స్నేహితులుగా కొనసాగారు. కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. ట్విస్ట్ ఇచ్చిన గురుదత్ వహీదా రెహమాన్‌కు తొలి బాలీవుడ్ సినిమా ఇచ్చిన గురుదత్.. కొన్నాళ్ల తర్వాత ఆమెకు ప్రపోజ్ చేశాడు. వహిదా కూడా అతన్ని ఇష్టపడింది. అయితే అప్పటికే గురుదత్‌కు పెళ్లి అయింది. 1953లో ప్రముఖ గాయని గీతాదత్‌ని గురుదత్ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం వహిదాకు తెలియదు. గురుదత్ కూడా దాచి పెట్టాడు. కానీ ‘ప్యాసా’ సినిమా విడుదలకు ముందే వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. ఒకనొక దశతో గురుదత్ భార్యకు విడాకులు ఇచ్చి వహిదాను పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. (సతీమణి గీతాదత్తో గురుదత్) భార్య కోసం ప్రేమ త్యాగం గురుదత్- వహిదా రెహమాన్‌ల ప్రేమ వ్యవహారం గీతాదత్‌కు కూడా తెలిసింది. భర్తతో గొడవకు దిగింది. కొన్నాళ్ల తర్వాత పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేరుగా జీవించడం ప్రారంభించింది. ఫ్యామిలీ అంతా దూరం అవ్వడాన్ని గురుదత్ తట్టుకోలేకపోయాడు. భార్య, పిల్లలు తిరిగి తన వద్దకు రావాలంటే.. ప్రేమను త్యాగం చేయాల్సిందే అనుకున్నాడు. అందుకే వహిదాను దూరం పెట్టడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు గీతా దత్ తిరిగి ఇంటికొచ్చింది. గురుదత్ చాలా రోజుల వరకు వహిదాను మర్చిపోలేదట. ఆమె తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడని అతని సన్నిహితులు చెప్పేవారు. కుంగిపోయిన వహీదా ప్రేమ విఫలం కావడంతో వహిదా కుంగిపోయింది. గురుదత్‌ని మర్చిపోవడానికి వరుస సినిమాలను ఒప్పుకుంది. నటిగా బీజీ అయింది. దేవ్ ఆనంద్‌తో ఎక్కువ సినిమా చేయడంతో అతనితో ప్రేమలో పడిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అదంతా ఒట్టి పుకారు మాత్రమే. గురుదత్ తర్వాత ఆమె ఎవరినీ ప్రేమించలేదు. 1974లో బాలీవుడ్ నటుడు శషిరేఖీని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సోహైల్ రేఖీ, కాశ్వీ రేఖీ ఉన్నారు. 2000 సంవత్సరంలో శషిరేఖీ చనిపోయాడు. ప్రస్తుతం వహిదా ముంబైలో పిల్లలతో కలిసి ఉంటోంది. మిస్టరీగా గురుదత్ మరణం వహిదా రెహమాన్ దూరం కావడంతో గురుదత్ కాపురంలో కూడా చిచ్చు రేగింది రేపింది. గురుదత్ మరణించినప్పుడు, భార్యతో కాక, ఒంటరిగానే ఉన్నాడు. అక్టోబరు 10, 1964 రోజు గురుదత్ తన మంచంలో చనిపోయి కనిపించాడు. మద్యం ఎక్కువైందో లేక నిద్రమాత్రలు అతిగా మింగాడో ఎవరికీ తెలియదు. ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ‘ఇన్ సర్చ్ ఆఫ్ గురుదత్’ పేరిట 1989లో డాక్యుమెంటరీ వచ్చింది. ఆయన బయోపిక్ నిర్మాణం కోసం బాలీవుడ్ డైరెక్టర్ భావనా తల్వార్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని గతంలో ప్రకటించారు. - పోడూరి నాగ ఆంజనేయులు -
వహ్వా వహిదా.. తెనాలి ఫిదా
తెనాలి: సినీ రంగంలో లబ్ధప్రతిష్టులైన కళాకారులకు భారత ప్రభుత్వం అందించే సర్వోన్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2021 సంవత్సరానికి స్వీకరించనున్న ప్రసిద్ధ బాలివుడ్ నటి వహిదా రెహమాన్ తెలుగు చిత్రసీమ నుంచే బాలివుడ్‌కు వెళ్లారు. విశాఖపట్టణంలో పెరిగిన వహిదా, అక్కణ్ణుంచే సినీరంగానికి పరిచయమయ్యారు. అయితే అందరికీ తెలీని విషయం ఏమిటంటే ఆమెకు ఆంధ్రాప్యారిస్ తెనాలితోనూ అనుబంధం ఉంది. విశాఖకు ముందు ఆమె తన తల్లిదండ్రులతోపాటు కొద్దికాలం తెనాలిలో ఉన్నారు. నాట్యం నుంచి ఆమె తెరంగేట్రం చేసినందున, ఆ నాట్యకళకు శ్రీకారం చుట్టింది కళల తెనాలిలోనే అని పెద్దలు చెబుతారు. వహిదా తండ్రి మున్సిపాలిటీ అధికారి వహిదా తండ్రి రెహమాన్ పట్టణ మున్సిపాలిటీలో అధికారిగా కొంతకాలం పనిచేశారు. అందుచేత వహిదా కొత్తపేటలోని తాలూకా హైస్కూలులో చదువుకున్నారు. అప్పట్లోనే ఆమె నాట్యం నేర్చుకుని ఉంటుందని, తనకు ఆమె బ్యాచ్‌మేట్ అని సీనియర్ కళాకారుడు, ‘నూరేళ్ల తెనాలి రంగస్థలి’ గ్రంథకర్త స్వర్గీయ నేతి పరమేశ్వరశర్మ చెప్పేవారు. ఆ తర్వాత ఆమె తండ్రికి విజయవాడకు బదిలీ అయింది. అక్కడకు వెళ్లాక కూడా వహిదా నాట్య సాధన కొనసాగించింది. పట్టణానికి చెందిన రాజకీయ నాయకుడు, కళాభిమాని, కళాపోషకుడు నన్నపనేని వెంకట్రావు అప్పట్లో ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలను స్వరాజ్ టాకీస్‌లో నిర్వహించేవారు. ఒకరోజు వహిదా రెహమాన్ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శన తిలకించిన వారిలో తానూ ఒకణ్ణని పరమేశ్వరశర్మ సంతోషపడేవారు. ప్రేక్షకుల మది గెలిచిన నటి తర్వాత వహిదా తాపీ చాణక్య తీసిన ‘రోజులు మారాయి’ సినిమాతో వెండితెరపై మెరిశారు. ‘ఏరువాక సాగారో’ పాటకు అద్భుతంగా నృత్యం చేశారు. ప్రజా నాట్యమండలి డప్పు కళాకారులు అమృతయ్య, ఏసుదాసులే ఆ పాటకు డప్పు వాయించారు. ఆ సినిమా ఎంత హిట్టయిందో తెలిసిందే. రోజులు మారాయి సినిమా శతదినోత్సవం తెనాలిలో జరిగినప్పుడు ఆ సినిమా హీరో అక్కినేని నాగేశ్వరరావు, వహిదా రెహమాన్ ఇద్దరూ తెనాలి వచ్చారు. అక్కినేనితోపాటు వహిదాకు తెనాలికి దగ్గర్లోని సంగంజాగర్లమూడిలో ఒక ఇంట్లో బస ఏర్పాటుచేశారు. తెనాలిలో అయితే ప్రేక్షకుల తాకిడి తట్టుకోలేమని నిర్వాహకులు భావించారు. అయినా విషయం తెలుసుకున్న ప్రేక్షకులు అనేకమంది ఆ ఇంటిని చుట్టుముట్టారట. దీంతో బసచేసిన భవనంపై నుంచి అక్కినేని, వహిదా ప్రేక్షకులకు అభివాదం చేశారని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ, ‘యోగాచార్య’ షేక్ మొహిద్దీన్ బాచ్చా ఒక సందర్భంలో చెప్పారు. చేబ్రోలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను, బిల్లులు మార్చుకునే నిమిత్తం తెనాలి వస్తుండగా మార్గమధ్యంలో సంగంజాగర్లమూడిలో నాగేశ్వరరావు, వహిదాను చూశానని వివరించారు. తెలుగు తెర నుంచే బాలివుడ్‌కు వెళ్లిన వహిదా అక్కడ ఓ వెలుగు వెలిగారు. తన అందంతోనే కాకుండా నాట్యంతో ప్రేక్షక హృదయాలు గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను స్వీకరించారు. మళ్లీ ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమె కీర్తి సిగలో కలికితురాయి కానుంది. -
పెళ్లైన హీరోతో ప్రేమ, చివరకు అలా.. వహీదా రెహమాన్ బ్రేకప్ స్టోరి
‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా..’ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటి వహీదా రెహమాన్‌ని ‘దాదా సాహేబ్ ఫ్యాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం’ వరించింది. భారతీయ సినీ పరిశ్రమకు 5 దశాబ్దాలుగా సేవలు అందించినందుకుగాను ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. వెండితెరపై ఎన్నో పాత్రలను పోషించిన అలరించిన వహిదా.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి చేరింది. సినిమా అవకాశాల కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఒకెత్తు అయితే... స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత ఆమె పడిన బాధ మరో ఎత్తు. గాఢంగా ప్రేమించిన వ్యక్తి.. తనను దూరం పెట్టడం.. వేరే హీరోతో ఎఫైర్ ఉందని ఆరోపించడం.. ఇలా తన సీనీ కెరీర్లో ఎన్నో బాధలను,అవమానాలను ఎదుర్కొన్నారు. అలా బాలీవుడ్ పయనం.. టాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది వహిదా రెహమాన్. 1955లో ‘రోజులు మారాయి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో ‘ఏరువాక సాగారో రన్నో..’పాట వహిదాకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఆమె దర్శకుడు గురుదత్ దృష్టిలో పడింది. ఆమె అందానికి, నటనకి ఫిదా అయిన గురుదత్ ‘సీఐడీ’ అనే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. అలా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వహిదా. 1956లో విడుదలైన ఆ చిత్రం..అప్పటికి అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కింది. వహిదా అందానికి ముగ్ధుడైన డైరెక్టర్ గురుదత్ హీరోగా అవతారమెత్తాడు. వహిదా కోసం ‘ప్యాసా’ చిత్రంలో కూడా హీరోగా నటించాడు. వాస్తవానికి తొలుత ఆ సినిమాకు హీరో దిలీప్ కుమార్. అయితే వహిదా రెహమాన్ హీరోయిన్గా చేస్తుందని తెలియడంతో దిలీప్ని తప్పించి తనే హీరోగా నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వహిదాకి గురుదత్ క్లోజ్ అయ్యాడు. తొలుత ఇద్దరి మంచి స్నేహితులుగా కొనసాగారు. కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. (చదవండి: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే..) ట్విస్ట్ ఇచ్చిన గురుదత్ తొలి బాలీవుడ్ సినిమా ఇచ్చిన గురుదత్.. కొన్నాళ్ల తర్వాత ఆమెకు ప్రపోజ్ చేశాడు. వహిదా కూడా అతన్ని ఇష్టపడింది. అయితే అప్పటికే గురుదత్‌కు పెళ్లి అయింది. 1953లో ప్రముఖ గాయని గీతాదత్‌ని గురుదత్ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం వహిదాకు తెలియదు. గురుదత్ కూడా దాచి పెట్టాడు. కానీ ‘ప్యాసా’ సినిమా విడుదలకు ముందే వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. ఒకనొక దశతో గురుదత్ భార్యకు విడాకులు ఇచ్చి వహిదాను పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. భార్య కోసం ప్రేమ త్యాగం గురుదత్-వహిదా రెహమాన్‌ల ప్రేమ వ్యవహారం గీతాదత్‌కు కూడా తెలిసింది. భర్తతో గొడవకు దిగింది. కొన్నాళ్ల తర్వాత పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేరుగా జీవించడం ప్రారంభించింది. ఫ్యామిలీ అంతా దూరం అవ్వడాన్ని గురుదత్ తట్టుకోలేకపోయాడు. భార్య, పిల్లలు తిరిగి తన వద్దకు రావాలంటే.. ప్రేమను త్యాగం చేయాల్సిందే అనుకున్నాడు. అందుకే వహిదాను దూరం పెట్టడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు గీతా దత్ తిరిగి ఇంటికొచ్చింది. గురుదత్ చాలా రోజుల వరకు వహిదాను మర్చిపోలేదట. ఆమె తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడని అతని సన్నిహితులు చెప్పేవారు. కుంగిపోయిన వహీదా ప్రేమ విఫలం కావడంతో వహిదా కుంగిపోయింది. గురుదత్‌ని మర్చిపోవడానికి వరుస సినిమాలను ఒప్పుకుంది. నటిగా బీజీ అయింది. దేవ్ ఆనంద్‌తో ఎక్కువ సినిమా చేయడంతో అతనితో ప్రేమలో పడిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అదంతా ఒట్టి పుకారు మాత్రమే. గురుదత్ తర్వాత ఆమె ఎవరినీ ప్రేమించలేదు. 1974లో బాలీవుడ్ నటుడు శషిరేఖీని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సోహైల్ రేఖీ, కాశ్వీ రేఖీ ఉన్నారు. 2000 సంవత్సరంలో శషిరేఖీ చనిపోయాడు. ప్రస్తుతం వహిదా ముంబైలో పిల్లలతో కలిసి ఉంటోంది. -
వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే..
అలనాటి అందాల తార వహీదా రెహమాన్ 'దాదాసాహెబ్ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డు'కు ఎంపికైంది. చిత్రపరిశ్రమకు అందించిన సేవలకుగానూ ఆమెకు ఈ సినీ అత్యున్నత పురస్కారం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోషల్ మీడియాలో నటి సేవలను కొనియాడారు. 5 దశాబ్దాలుగా సేవల.. 'భారతీయ చిత్రపరిశ్రమకు ఐదు దశాబ్దాలుగా వహీదా రెహమాన్‌గారు అందించిన అద్భుతమైన సేవలకుగానూ ఆమెకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వనున్నాం. ఈ పురస్కారాన్ని ఆమెకు ప్రకటించినందుకుగానూ నాకెంతో సంతోషంగా ఉంది. హిందీ సినిమాల్లో అత్యధికంగా నటించిన వహీదా విమర్శలకు నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. వాటిలో ప్యాసా, కాగజ్ కే పూల్, చౌదావికా చంద్, సాహెబ్ బివి ఔర్ గులాం, గైడ్, కామోషి తదితర చెప్పుకోదగ్గ చిత్రాలున్నాయి అని ట్వీట్ చేశారు. తొలి సినిమాతోనే క్రేజ్.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వారిలో వహీదా ఒకరు. 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించింది. ఎన్టీఆర్ తన సొంత సంస్థలో 'జయసింహ' కథ తీసేందుకు రెడీ అవగా ఇందులో రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని తీసుకుకోవాలని భావించాడు. అలా ఈ పాత్ర వహీదా రెహమాన్‌ను వరించింది. కానీ అప్పటికే రోజులు మారాయి సినిమాలో ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా పాటకు ఆమెతో డ్యాన్స్ చేయించడంతో ఇదే తన తొలి చిత్రంగా మారింది. 1971లో 'రేష్మా ఔర్ షేరా' చిత్రంతో వహీదా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచింది. 1972లో 'పద్మశ్రీ', 2011లో 'పద్మభూషణ్' అందుకుంది. I feel an immense sense of happiness and honour in announcing that Waheeda Rehman ji is being bestowed with the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award this year for her stellar contribution to Indian Cinema. Waheeda ji has been critically acclaimed for her… — Anurag Thakur (@ianuragthakur) September 26, 2023 చదవండి: మెగాస్టార్‌తో రొమాంటిక్ స్టెప్పులేసి తర్వాత చెల్లిగా, తల్లిగా నటించిన నటి ఎవరంటే? -
ఏడాదికి రెండుసార్లు నటి బర్త్‌డే: ఎందుకంటే?
అలనాటి అందాల తార వహీదా రెహమాన్ టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. ఆమె పేరు చెప్పగానే చాలామందికి రోజులు మారాయి సినిమాలో ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా.. పాట గుర్తొస్తుంది. ఇదే ఆమె మొదటి చిత్రం అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించింది. అలీబాబా 40 దొంగలు సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. ఇంతకీ ఈ రోజు వహీదా ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. నేడు ఆమె బర్త్‌డే కాని బర్త్‌డే. ఏంటి? అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే! డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయిన వారిలో వహీదా ఒకరు. ఆమె 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించింది. చిన్నప్పుడే నాట్యం నేర్చుకుంది. తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ మరణంతో ఆమె నృత్యమే తనకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూతనిచ్చింది. ఎన్టీఆర్ తన సొంత సంస్థలో 'జయసింహ' కథ తీసేందుకు రెడీ అవగా ఇందులో రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని తీసుకుకోవాలని భావించాడు. అలా ఈ పాత్ర వహీదా రెహమాన్‌ను వరించింది. కానీ అప్పటికే దర్శకుడు తాపీ చాణక్య ఆమెను 'రోజులు మారాయి'లోని ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా పాటకు ఆమెతో డ్యాన్స్ చేయించడంతో ఇదే ఆమెకు తొలి సినిమాగా మారింది. ఇందులో ఆమె డ్యాన్స్ చూసిన గురుదత్ ఆమెను 'సీఐడీ'తో హిందీ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. 1971లో 'రేష్మా ఔర్ షేరా' చిత్రంతో వహీదా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచింది. 1972లో 'పద్మశ్రీ', 2011లో 'పద్మభూషణ్' అందుకుంది. తన తొలి హీరో ఎన్టీఆర్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందించే ఎన్టీఆర్ నేషనల్ అవార్డును 2006లో సొంతం చేసుకుంది. రెహమాన్‌ను గురుదత్ ఎంతో ప్రేమించాడు. కానీ ఆయనకు అప్పటికే పెళ్లైంది. 1974లో హీరో కమల్ జీత్‌ను పెళ్లి చేసుకుంది వహీదా. వీరికి ఇద్దరు సంతానం. అండమాన్, నికోబార్ దీవుల్లో వహీదా బోటింగ్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు పనిలో పనిగా వహీదాకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. కానీ నేడు ఆమె పుట్టిన రోజు కాదు, ఫిబ్రవరి 3 అసలు బర్త్‌డే. ఇదే విషయాన్ని ఆమె ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ రోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారట అభిమానులు. దీంతో ప్రతి ఏటా రెండుసార్లు బర్త్‌డే జరుపుకుంటోంది వహీదా.. -
దిశ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన సీనియర్ నటి..
ముంబై : దిశ హత్యాచార ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పాతతరం నటి వహీదా రెహమాన్ నిందితుల ఎన్కౌంటర్ సరైంది కాదని వ్యాఖ్యానించారు. లైంగిక దాడి హేయమైందని, క్షమించరాని నేరమని అంటూ నిందితుడికి యావజ్జీవ ఖైదు విధించాలని, మరణ శిక్ష తగదని అభిప్రాయపడ్డారు. ఓ వ్యక్తిని చంపడం మన చేతుల్లో ఉండరాదని, లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు విధించాన్నదే తన ఉద్దేశమని ఆమె వ్యాఖ్యానించారు. నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సందర్భాల్లో కేసు నమోదు చేయరాదని అన్నారు. నిందితులు నేరానికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే కేసు ఎందుకు నమోదు చేస్తారని, అది ప్రజా ధనం వృధా చేయడమేనని 81 సంవత్సరాల వహీదా రెహమాన్ పేర్కొన్నారు. ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న నటి ఈ వ్యాఖ్యలు చేశారు. -
నా పేరులో సెక్సప్పీల్ లేదన్నారు!
పదహారేళ్ల వయసులోనే పేరు కోసం పెద్ద పోరాటం చేయాల్సి వచ్చిందని సుప్రసిద్ధ నటి వహీదా రెహమాన్ అన్నారు. జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో గురువారం ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ‘‘మద్రాసులో ఉండగా, పదహారేళ్ల వయసులో హిందీ సినిమాలో నటించమని నటుడు, దర్శక, నిర్మాత గురుదత్ బొంబాయికి పిలిపించారు. ‘సిఐడి’ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు కాంట్రాక్టు సైన్ చేసే సమయంలో పేరు మారుస్తామని చెప్పారు. అయితే నేను అంగీకరించలేదు అన్నారు. మధుబాల, దిలీప్ కుమార్, మీనాకుమారి తదితరులంతా తమ అసలు పేరును వదిలి వేరే పేర్లు పెట్టుకున్నారు. అది ఒక ఆచారమని, కనుక నీ పేరు మార్చుకోవాల్సిందేనని వాళ్ళు బలవంతపెట్టారు. అంతేకాక ‘వహీదా రెహమాన్’ అనే పేరులో సెక్సప్పీల్ లేదు కనుక, తప్పనిసరిగా మార్చాల్సిందేనని, లేకుంటే వేరొకర్ని చూసుకుంటామని అన్నారు. అది నా తల్లిదండ్రులు పెట్టిన పేరు కనుక నేను దానిని మార్చుకోనని, కావాలంటే సినిమాయే వదులుకుంటానని చెప్పాను. అయితే మీరు హోటల్‌కు వెళ్లండి, మేం ఏ సంగతి చెప్తామని పంపించేశారు. కానీ, మూడు రోజుల తర్వాత నా పేరుతోనే కొనసాగడానికి అంగీకరించారు’’ అని వహీదా తెలిపారు. తాను నటించిన సినిమాల్లో ‘గైడ్’ తనకు ఇష్టమని, అది కాకుండా ‘ఖామోషీ’, ‘ముఝే జీనే దో’, ‘ప్యాసా’, తనది ముఖ్య పాత్ర కాకపోయినా ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ ఇష్టమని అన్నారు. తాను చూసిన దర్శకుల్లో గురుదత్, సత్యజిత్‌రే చాలా గొప్పవారని, అయితే గురుదత్ ఒక్క టేక్‌తో సంతృప్తిపడేవారు కారని, సత్యజిత్‌రే అనవసరంగా ఒక్క టేక్కు మించి చేసినా అంగీకరించేవారు కాదని అన్నారు. ఒక సినిమాకోసం గురుదత్ 76 టేక్‌లు తీసుకున్న సందర్భం చరిత్రలో ఉందని గుర్తుచేశారు. ఈ తరం నటుల్లో అభిషేక్ బచ్చన్ నాతో స్నేహంగా ఉండే నటుడని, ఇంతకాలం గడిచినా ప్రజలు ఎక్కడికి వెళ్లినా తనను ఆదరించడం చూసి తనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదని కరతాళధ్వనుల మధ్య చెప్పారు. (జైపూర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
శ్రీ నిలయం మూవీ పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్
-
ఇక నటనకు వీడ్కోలు!
అందం, అభినయానికి చిరునామా అనిపించుకున్నారు వహీదా రెహ్మాన్. ఒకప్పుడు నాయికగా ఆమె ఓ స్థాయిలో రాణించారు. జయసింహా, రోజులు మారాయి, బంగారు కలలు తదితర తెలుగు చిత్రాల్లో నటించిన వహీదా ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్‌కి పరిమితమయ్యారు. ‘రోజులు మారాయి’లో ‘ఏరువాకా సాగారో..’ పాటలో ఆమె అభినయం సులువుగా మర్చిపోలేరు. ఇక, త్వరలో విడుదల కానున్న కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’లో అతిథి పాత్ర చేశారామె. నటిగా వహీదాకి ఇదే చివరి సినిమా అవుతుందని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న వహీదా మాట్లాడుతూ - ‘‘1950 నుంచి నటిస్తూనే ఉన్నా. ఇంకెంత కాలం చేయమంటారు? కథానాయికగా, తల్లిగా, అమ్మమ్మగా.. ఇలా పలు పాత్రలు చేశాను. నాలా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లు యాక్ట్ చేస్తారు. ఇక నేను సినిమాలకు వీడ్కోలు చెప్పాలనుకుంటున్నా. ‘విశ్వరూపం 2’లో చేశాను. కమల్‌హాసన్ చాలా ప్రతిభ గలవాడు’’ అన్నారు. పాత రోజులు గుర్తు చేసుకుంటూ.. అప్పట్లో తను సినిమాల్లోకొచ్చినప్పుడు, పేరు మార్చుకోమని ఒత్తిడి చేశారని, తన తల్లీతండ్రీ ఇచ్చిన పేరుని మార్చుకోనని కరాఖండిగా చెప్పేశానని వహీదా పేర్కొన్నారు. సినిమాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ స్లీవ్‌లెస్ బ్లౌజు వేసుకోలేదని, ఇక బికినీ వేసుకోమన్నా వేసుకో నని తెలిసి ఎవరూ అడగలేదని వహీదా తెలిపారు. ఇటీవలే ఆమె వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో ‘కాన్వర్జేషన్స్ విత్ వహీదా’ అనే పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకం బాలీవుడ్లో సంచలనమైంది. -
ఐ డోంట్ కేర్..!
న్యూఢిల్లీ: సహాయ పాత్రలతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఓ సమయంలో అగ్రహీరోలతో సమానమైన ప్రేక్షకాదరణను పొందారు. ఆశా పరేఖ్, మాలా సిన్హా, వహీదా రెహ్మాన్ వంటి అందాల తారల సరసన నటించి, బెంగాలీ అభిమానులకే కాకుండా బాలీవుడ్ అభిమానులనూ ఉర్రూతలూగించారు. లేటు వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించి, దేశ రాజధానికి గుండెకాయగా చెప్పుకునే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తాను గెలుస్తానన్న ఆత్మవిశ్వాసం తనకుందని, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అంతకుమించి ప్రోత్సాహాన్ని తనకు అందిస్తోందన్నారు. ప్రత్యర్థుల పేర్లు, వారి చరిత్రలు చూసి భయపడి వెనకడుగు వేసే వ్యక్తిత్వం తనది కాదన్నారు. వారెవరనే విషయాన్ని తాను అసలు పట్టించుకోనని చెప్పారు. న్యూఢిల్లీ నియోజవర్గంలో తన విజయావకాశాల గురించి, తాను చేస్తున్న ప్రచారం గురించి ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘క్యారెక్టర్ ఆర్టిస్టుగా బెంగాలీ చిత్రంతో సినిమాల్లోకి ప్రవేశించాను. ఆ తర్వాత ఒక్కోమెట్టు ఎదుగుతూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. అగ్రహీరోల సరసన స్థానం సంపాదించుకున్నాను. సినీ పరిశ్రమలో పెద్దపెద్దవాళ్లున్నారని ఎప్పుడూ బెదరలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాను. అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. అప్పటి నుంచే ప్రత్యర్థుల గురించి ఆలోచించడం మానేశాను. లేటు వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టావని కొందరంటున్నారు... వయసు ప్రభావం రాజకీయాల్లో జయాపజయాలపై ఉండదనేది నా అభిప్రాయం. నిజానికి వయసు అనుభవాన్నిస్తుంది. ఆ అనుభవంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మిగతావారితో పోలిస్తే నేనే అత్యంత అనుభవమున్న వ్యక్తిని. ఇది నాకు అనుకూలాంశం. యువకులు ఆవేశపడతారు.. ఆందోళనకు దిగుతారు. కానీ వయసు మీదపడినవారు ఆలోచనతో ముందుకెళ్తారు. ప్రజలకు సేవ చేయడానికి అవసరమైనది కేవలం మంచి చేయాలన్న ఆలోచన మాత్రమే. అది నాకుంది. మూడో ఇన్నింగ్.. బెంగాలీ చిత్రసీమలోకి అడుగుపెట్టడం తొలి ఇన్నింగ్ అయితే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం రెండో ఇన్నింగ్. ఇక తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి జీవితంలో మూడో ఇన్నింగ్‌ను ప్రారంభించాను. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన చాలా రోజుల నుంచే ఉంది. అయితే ఇదే సరైన సమయమనే అభిప్రాయంతో ఇప్పుడు అడుగుపెట్టాను. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తాను. ఇక గెలుపోటములన్నవి ఇప్పుడే ఎవరూ నిర్ణయించలేని విషయం. ఎన్నికలు టీ20 మ్యాచ్‌లాంటిది. చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో చెప్పడం కష్టం. నా గెలుపుకోసం నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. పార్టీ నుంచి కూడా అవసరమైనంత సహకారం అందుతోంది. ఇక నా ప్రత్యర్థుల విషయానకి వస్తే ఎవరు బలవంతులు? ఎవరు బలహీనులు? అనే విషయాలపై నేను దృష్టిపెట్టలేదు. రాజకీయాల్లో బలవంతులు, బలహీనులు ఉండరనేది నా అభిప్రాయం. ‘మా, మతి, మానుష్’(కన్నతల్లి, కన్నభూమి, మానవత్వం) నినాదంతో ఎన్నికల్లోకి వెళ్తున్నాం. ఇదే నినాదంతో 2009 ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ భారీ విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు కూడా ఆ మ్యాజిక్ జరగక మానద’న్నారు. బెంగాలీల జనాభా ఎక్కువే... ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసేముందు మరో ఆలోచన ఏదీ లేకుండా బిశ్వజీత్ పేరును ఎంపిక చేశారని మమతా బెనర్జీ చెప్పడం వెనుక అనేక వ్యూహాలు దాగి ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో బెంగాలీల జనాభా ఎక్కువగానే ఉంది. ఇక్కడి చిత్తరంజన్ పార్కు ప్రాంతాన్ని మినీ బెంగాల్‌గా పిలుస్తారు. దీంతోపాటు చటర్జీ అమ్ముల పొదిలో ‘బాలీవుడ్ హీరో ’ అనే మరో అస్త్రం ఉండనే ఉంది. దీంతోపాటు అన్నా హజారే వంటి ప్రముఖ సామాజిక కార్యకర్తలు దీదీ(మమతా బెనర్జీ)కి తమ మద్దతును ప్రకటించారు. ఇది కూడా న్యూఢిల్లీ నియోజకవర్గంలో చటర్జీకి కలిసిరావొచ్చంటున్నారు.