
కె.కేశవరావు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సవరణలలో భాగంగా పోలవరం ప్రాజెక్టు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ రోజు రాజ్యసభలో టిఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పోలవరం బిల్లుకు తాము వ్యతిరేకం అని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైయ్యే ఏడు మండలాలలను ఆంధ్రప్రదేశ్లో కలపడాన్ని టిఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది.
ఇదిలా ఉండగా, నోటీసు ఇచ్చినప్పటికీ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి నిరాకరించారు. అయితే పోలవరం బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ సభ్యుడు జైరామ్ రమేష్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ మాట్లాడారు.