కళ్లు మూసుకుని కూర్చోలేం | We cant sit with closed eyes | Sakshi
Sakshi News home page

కళ్లు మూసుకుని కూర్చోలేం

Published Wed, Nov 9 2016 1:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

కళ్లు మూసుకుని కూర్చోలేం - Sakshi

కళ్లు మూసుకుని కూర్చోలేం

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ధర్మాసనం
- క్షేత్రస్థారుు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉండలేం
- అనర్హత పిటిషన్లను స్పీకర్ పరిశీలిస్తారన్న నమ్మకం లేదని వ్యాఖ్య
- రాజ్యాంగ ధర్మాసనానికి ఫిరారుుంపుల కేసు బదిలీ
- సభాధికారాల్లో మాత్రమే స్పీకర్ సుప్రీం
- ఆయన నిర్ణయంపై న్యాయ సమీక్షకు వీలుందిగా
- నిర్ణయం తీసుకోనప్పుడూ సమీక్ష ఎందుకు జరపలేం?
- దీనిని రాజ్యాంగ ధర్మాసనమే తేల్చాలన్న న్యాయస్థానం
 
 ‘‘అనర్హత పిటిషన్లు ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉండటాన్ని ఎలా చూడాలి? స్వయంగా స్పీకరే ఫిరారుుంపులకు పాల్పడ్డ ఉదంతాలు కూడా మనం చూశాం. క్షేత్రస్థారుులో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా మేం కళ్లు మూసుకుని కూర్చోలేం కదా! స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు తగిన కాలపరిమితి ఉంటే పిటిషన్లు పరిష్కారమవుతారుు. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు సమీక్షించగలిగినప్పుడు, ఆయన నిర్ణయం తీసుకోకపోవడాన్ని కూడా సమీక్షించవచ్చన్నది ప్రాథమికంగా మా అభిప్రాయం. అరుునా దీనిపై రాజ్యాంగ ధర్మాసనమే నిర్ణయాన్ని వెలువరించాలి’’
     - సుప్రీంకోర్టు ధర్మాసనం
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఫిరారుుంపులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్షేత్రస్థారుులో జరుగుతున్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తాము కళ్లు మూసుకుని కూర్చోలేమని స్పష్టం చేసింది. ఫిరారుుంపులపై 1992లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అనంతరం దేశవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. స్వయంగా స్పీకరే పార్టీ ఫిరారుుంచిన ఉదంతాలున్నాయని ప్రస్తావించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరారుుంచడంపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు శాసన సభాపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ విప్ ఎస్.ఎ.సంపత్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.

జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ కేసుకు సంబంధించి స్పీకర్ పరిధిపై వ్యాఖ్యానించేందుకు రాజ్యాంగ ధర్మాసనం అవసరమని అభిప్రాయపడింది. ‘‘స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉన్నప్పుడు, నిర్ణయం తీసుకోకపోవడం కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని ప్రాథమికంగా అవగతమవు తోంది. ఈ కేసులో అనర్హత పిటిషన్లు 2014 ఆగస్టు 23న దాఖలయ్యారుు. వాటిపై స్పీకర్ త్వరితగతిన నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ఆశాభావం వెలిబుచ్చినా ఆయన ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేకపోయారు. కాబట్టి ఈ అంశాలను తేల్చేందుకు సాధ్యమైనంత త్వరగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నాం’ అని పేర్కొంది.

 అనర్హత పిటిషన్ల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో తెలపాలని అక్టోబర్ 26న విచారణ సందర్భంగా సభాపతిని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ నారీమన్ ఆదేశించడం తెలిసిందే. మంగళవారం ఈ కేసు ప్రారంభం కాగానే స్పీకర్ తరఫున భారత అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ, అసలు ఈ పిటిషన్‌ను ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. ‘‘హైకోర్టు కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీచేయకుండానే సుప్రీంకోర్టులో ఎలా పిటిషన్ దాఖలు చేశారు? అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనంత వరకు ఈ విషయంలో హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీచేయజాలదు’’ అని ఆయన పేర్కొన్నారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు ప్రారంభిస్తూ ఉత్కల్ కేసరీ పరీడా వర్సెస్ ఒడిశా అసెంబ్లీ స్పీకర్ కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు.

ఆ కేసును 8 వారాలకు మించకుండా పరిష్కరించాలని స్పీకర్‌ను ఆదేశించిందని. ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. ప్రస్తుత కేసులో అనర్హత పిటిషన్లను పరిష్కరించేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలంటూ స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశించినా ఆయన అఫిడవిట్ సమర్పించలేదని అన్నారు. అటార్నీ జనరల్ ఎవరి తరపున వకాల్తా జరపుతున్నారని, ఈ కేసుతో ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. తాను స్పీకర్ తరపున వాదిస్తున్నానని రోహత్గీ బదులిచ్చారు. ‘హరియాణా విధాన సభ స్పీకర్ వర్సెస్ కుల్‌దీప్ బిష్ణోయ్ కేసులో అనర్హత పిటిషన్లను స్పీకర్ నాలుగు నెలల్లో పరిష్కరించాలంటూ ‘హరియాణా-పంజాబ్’ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందని జంధ్యాల గుర్తుచేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకుని స్పీకర్‌కు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరారు.

 స్పీకర్ పరిధిలో జోక్యం చేసుకోజాలరు: రోహత్గీ
 బిష్ణోయ్ కేసు చాలా పరిమితమైన అంశానికి సంబంధించిందని రోహత్గీ వాదించారు. ఆ కేసులో హైకోర్టు ఆదేశాలను చాలావరకు సుప్రీంకోర్టు పక్కనపెట్టిందన్నారు. ‘‘కిహోటా హోలోహాన్ వర్సెస్ జచిల్లూ అండ్ అదర్స్-1992 కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని అంశాలు ప్రస్తుత ఫిరారుుంపుల కేసుల్లోని అంశాలన్నింటినీ పరిష్కరిస్తారుు. ఆ తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం వెలువరించకముందు ఆయన అధికార పరిధిలో న్యాయస్థానం జోక్యం చేసుకోజాలదు. అనర్హత పిటిషన్లపై విచారణ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండగా న్యాయ సమీక్షకు ఆస్కారం లేదని ఆ తీర్పులోని 110వ పేరా స్పష్టం చేస్తోంది. దీనికి కేవలం ఒకే ఒక్క మినహారుుంపు ఉంది. అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే అనర్హత వేటు గానీ, సస్పెన్షన్ గానీ విధించినప్పుడు మాత్రమే ఆ నిర్ణయంపై న్యాయసమీక్ష జరపొచ్చని ఆ తీర్పు స్పష్టం చేసింది. కానీ ప్రస్తుత కేసులో అనర్హత పిటిషన్లు పెండింగ్‌లోనే ఉన్నారుు’’ అని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలాగే స్పీకర్ కూడా తన అధికారాల్లో సుప్రీమేనని వాదించారు.
 
 సభాధికారాల్లోనే సుప్రీం: జస్టిస్ నారీమన్

 సభాపతి సభాధికారాల్లో మాత్రమే సుప్రీం అని జస్టిస్ నారీమన్ స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించగలిగినప్పుడు ఆయన నిర్ణయం తీసుకోకపోవడాన్నీ సమీక్షించవచ్చన్నది ప్రాథమికంగా తమ అభిప్రాయమన్నారు. దీనిపై  రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించా లన్నారు. ‘‘ఆర్టికల్ 212(2) ప్రకారం స్పీకర్ సభను నియంత్రించగలరు. కానీ తనకున్న ఇమ్యూనిటీ విషయంలో సుప్రీం కాజాలరు. స్పీకర్ తీసుకునే నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటారుు కదా! మరీ ఆయన నిర్ణయం తీసుకోక పోవడాన్నీ సమీక్షించవచ్చు కదా’’ అని ప్రశ్నిం చారు. ‘‘అనర్హత పిటిషన్లు ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉండటాన్ని ఎలా చూడాలి? స్వయంగా స్పీకరే ఫిరారుుంపులకు పాల్పడ్డ ఉదంతాలు చూశాం.

క్షేత్రస్థారుులో వాస్తవాలను పరిగణనలోకి తీసుకో కుండా మేం కళ్లు మూసుకుని కూర్చోలేం కదా.. మీరు చెబుతున్న కిహోటా కేసు 1992 నాటిది. నాటి నుంచి జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు తగిన కాలపరిమితుంటే పిటిషన్లు పరిష్కారమవు తారుు’’ అని పేర్కొన్నారు. రోహత్గీ స్పందిస్తూ, సుప్రీంలో కేసులు ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉన్నా యన్నారు. ‘‘స్పీకర్ నిర్ణయం తీసుకునేందు కు కాలపరిమితి నిర్ణరుుస్తే ఇక పిటిషన్లను ఆపలేం. పదో షెడ్యూలుకు అర్థమే ఉండదు’’ అని పేర్కొన్నారు. జస్టిస్ నారీమన్ స్పందిస్తూ, ఒక్కో కేసులో ఒక్కో వాస్తవం ఉంటుందని, వాటి ఆధారంగా పిటిషన్లను పరిష్కరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతిమంగా స్పీకరే సుప్రీం అని రోహత్గీ మరోసారి అన్నారు. ‘‘ఆయన నిర్ణయం తీసుకోనంతవరకు న్యాయసమీక్ష జరప డానికి వీల్లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. మనం నమ్మాలి’’అని పేర్కొన్నారు.

స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని నమ్మలేమని జస్టిస్ ఫాలిమన్ వ్యాఖ్యానించారు. ‘‘క్షేత్రస్థారుు పరిణామాలు, ఇబ్బందులు గమనించాలి. 1992 నుంచి ఇప్పటివరకు ఏం జరుగుతోందో చూడ ండి’’ అని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లు 2014 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉన్నాయని జంధ్యాల గుర్తు చేశారు. ‘‘హైకోర్టుకు వెళ్తే, అనర్హత పిటి షన్లను స్పీకర్ త్వరితగతిన పరిష్కరిస్తారని ఆశిస్తు న్నామని కోర్టు పేర్కొంది. కానీ ఇప్పటివరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఏం జరుగుతోందో చూడండి’’ అన్నారు. కిహోటా కేసులో నాటి రాజ్యాంగ ధర్మాసనం దృష్టి సారించిన అంశాలు అప్పటి పరిస్థితులను ప్రతిఫలిస్తున్నాయన్న జస్టిస్ నారీమన్, ఇప్పటి పరిణామాలు వేరుగా ఉన్నందున ఈ కేసును ఐదుగురు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరించాల్సుందన్నారు.

చివరగా ఉత్తర్వులు జారీ చేస్తూ.. ‘ప్రస్తుత పిటిషన్ కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని హైకోర్టు న్యాయ సమీక్ష జరపగలదా? అనర్హత పిటిషన్ల పరిష్కారా నికి  కాల పరిమితి విధించవచ్చా? విధించలేమని ప్రతివాది తరపున, కాలపరిమితి విధిస్తూ స్పీకర్‌ను ఆదేశించవచ్చని వాది తరఫున వాదనలు వచ్చారుు. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనమే తేల్చాలి’’ అన్నారు. అక్టోబర్ 26న స్పీకర్‌కు తామిచ్చిన ఆదేశాలను అటార్నీ జనరల్ విన్నపం మేరకు నిలుపుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement