న్యూఢిల్లీ: వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకుని మరింత కచ్చితంగా వర్షపాతాన్ని అంచనా వేసేందుకు 660 జిల్లాల్లో వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఐఎండీ (భారత వాతావరణ విభాగం) తెలిపింది. తొలి దశలో 130 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో(కేవీకే)నే వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో వాతావరణ విభాగం ఒప్పందం చేసుకుంది. వారంలో నాలుగు రోజులు (సోమవారం నుంచి గురువారం వరకు) వాతావరణ అంచనాలను ఈ కేంద్రాలు విడుదల చేస్తాయి. 2016 నాటికి దేశంలో 707 జిల్లాలున్నాయి.