6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై' | Wi-Fi facilities in 6 universities, 69 colleges of Odisha | Sakshi
Sakshi News home page

6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై'

Published Thu, Mar 5 2015 4:32 PM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై'

6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై'

ఇంటర్ నెట్ సౌకర్యాన్ని యూనివర్సిటీలు, కళాశాలలకు అందుబాటులోకి తెచ్చేలా ఒడిశా ప్రభుత్వం స్మార్ట్ క్యాంపస్ పథకం అమలు చేస్తోంది. దీనికోసం రూ. 20కోట్లను ఖర్చు చేయనుంది. ఇందులో భాగంగా 6 యూనివర్సిటీలకు, 46 ప్రభుత్వ కళాశాలలు, 23 ప్రైవేటు కళాశాలల్లో వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

అంతేకాక విద్యాసంస్థలలో అత్యాధునిక స్మార్ట్ క్లాస్ రూంలు, ఈ లైబ్రరీ, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లాబొరేటరీల వంటి సదుపాయాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి తేనున్నట్టు ఉన్నతా విద్యాశాఖ మంత్రి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి తెలిపారు. గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సౌకర్యాలను మరొకొన్ని యూనివర్సిటీలు, కాలేజీలకు విస్తరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు నిర్వహణ బాధ్యతలను బీఎస్ఎన్ఎల్ అధికారులు చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలలో సర్వే ప్రారంభమైనట్టు చెప్పారు.

Advertisement
Advertisement