పాట్నా: మరుగుదొడ్డి నిర్మాణం కోసం మంగళసూత్రాన్ని అమ్మివేసిన ఓ మహిళ గతంలో వార్తల్లోకెక్కింది. తాజాగా బీహార్‌లో టాయిలెట్ కట్టిస్తేనే కాపురానికొస్తానంటూ ఓ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. పాట్నా జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. బిక్రమ్ గ్రామానికి చెందిన కార్పెంటర్ రాకేశ్ శర్మతో బాబ్లీ దేవి(20)కి గతేడాది వివాహం అయింది. ఇంటి వద్ద టాయిలెట్ కట్టించాలంటూ కాపురానికి వచ్చినప్పుడు ఆమె కోరగా అందుకు అంగీకరించిన రాకేశ్ తర్వాత పట్టించుకోలేదు. చివరికి మరుగుదొడ్డి నిర్మాణానికి తిరస్కరించాడు.
వాగ్వాదం జరగడంతో ఆమెను కొట్టాడు. దీంతో విసిగిపోయిన బాబ్లీ దేవి ఇక లాభం లేదనుకుని పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి బయలుదేరింది. పనిలోపనిగా తన భర్త మరుగుదొడ్డిని కట్టించేలా చూడాలని కోరుతూ పాట్నా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. మరుగుదొడ్డి కట్టేదాకా ఆ ఇంటికి వచ్చేదేలేదంటూ స్పష్టం చేసింది. ‘బహిర్భూమికి వెళ్లడం మహిళకు సిగ్గుచేటు. ఇది ఆరోగ్యం, గౌరవం, హుందాతనానికి సంబంధించిన విషయం’ అని ఆమె చెప్పింది.
‘టాయిలెట్ కడితేనే కాపురానికొస్తా’!
Published Sun, Nov 23 2014 1:01 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement