ఆస్పత్రిలో మహిళపై సామూహిక అత్యాచారం | Woman gang raped in Kolkata hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో మహిళపై సామూహిక అత్యాచారం

Published Sun, May 31 2015 3:24 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

ఆస్పత్రిలో మహిళపై సామూహిక అత్యాచారం

ఆస్పత్రిలో మహిళపై సామూహిక అత్యాచారం

కోల్కతా: బంధువును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు ఉద్యోగులు లైంగికదాడికి పాల్పడ్డారు. కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.

పశ్చిమబెంగాల్లోని ముషీరాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి శుక్రవారం కోల్కతా వచ్చింది. తన బంధువును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. ఈ రోజు రాత్రి ఆస్పత్రిలో పనిచేసే లిఫ్ట్మన్, మరో ఉద్యోగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు మసూమ్ అలీ ఖాన్, హైదర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో పనిచేసే మహిళా సిబ్బంది,  మహిళా రోగులు భయపడుతున్నారు. మహిళలకు భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement