kolkata hospital
-
తప్పు ఎవరిది? శిక్ష ఏమిటి?
దేశాన్ని అట్టుడికించిన కేసులో కోర్టు తీర్పు వెలువడింది. తీరా తీర్పు సైతం ఆ కేసులానే చర్చకు దారి తీస్తోంది. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలోని సెమినార్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్‌పై గత ఆగస్ట్ 9న జరిగిన దారుణ హత్యాచార ఘటనపై తాజా తీర్పు సహేతుకం కాదనే విమర్శ వినిపిస్తోంది. ఆస్పత్రిలో వాలంటీరైన సంజయ్ రాయ్ భారతీయ న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద నేరస్థుడంటూ శనివారమే కోర్ట్ ప్రకటించేసింది. కానీ, ఈ కేసులో అతనికి ఉరిశిక్ష బదులుగా యావజ్జీవ కారాగారవాస శిక్ష మాత్రమే విధిస్తున్నట్టు సియాల్డాలోని అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్ట్ సోమవారం తీర్పు చెప్పేసరికి మళ్ళీ తేనెతుట్టె కదిలింది. బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారే కాక, అటు కేంద్ర నేరదర్యాప్తు సంస్థ (సీబీఐ), ఇటు బాధితురాలి కుటుంబం సైతం నేరస్థుడికి ఉరిశిక్ష విధించాలంటూ వాదించింది. కానీ, అంతటి తీవ్ర శిక్ష విధించేందుకు హేతుబద్ధత లేదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం గమనార్హం. దాంతో, మహిళా లోకంలో, బాధిత, వైద్య వర్గాల్లో అసహనం కట్టలు తెంచుకుంది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలే అందుకు నిదర్శనం.హత్యాచారానికి గురైన ఆడకూతురు, ఆమె కుటుంబం బాధను ముగ్గురు ఆడపిల్లలకు తల్లినైన తాను అర్థం చేసుకోగలనంటూ నేరస్థుడి తల్లే స్వయంగా అనడం గమనార్హం. కన్నకొడుకైనా సరే నేరం రుజువైతే, శిక్ష పడాల్సిందేనని ఆ మాతృమూర్తి అన్న మాటలు జరిగిన ఘటన రేపిన భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. పైపెచ్చు, ఆగస్ట్ 9 తర్వాత బెంగాల్లో అయిదు హత్యాచార ఘటనల్లో, మైనర్లపై దారుణానికి పాల్పడ్డ నేరస్థులకు ‘పోక్సో’ కోర్టులు ఏకంగా మరణశిక్షే విధించాయి. అందుకే, ఈ కేసులోనూ నేరస్థుడికి ఉరిశిక్ష పడుతుందనీ, పడాలనీ బలమైన భావన వ్యాపించింది. అయితే జరిగింది వేరు. బెంగాల్‌నే కాక అప్పట్లో భారత్ మొత్తాన్నీ కదిలించిన ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 17 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ ఘటన ఉరిశిక్ష విధించాల్సినంత అత్యంత అరుదైన కేసు ఏమీ కాదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. బెంగాల్ ఏలిక మమతా బెనర్జీ సైతం తీర్పుతో సంతృప్తికరంగా లేమంటూ కుండబద్దలు కొట్టేసి, తీర్పుపై హైకోర్టుకు వెళతామని తేల్చేశారు. సర్వసాధారణంగా నేరం తాలూకు తీవ్రత, సమాజంపై దాని ప్రభావం, నేరస్థుడి గత చరిత్ర, ప్రవర్తన లాంటివన్నీ మరణశిక్ష విధింపునకు ప్రాతిపదిక అవుతాయి. అయితే, గౌరవ న్యాయస్థానం తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఎలాంటి తీర్పునైనా ఇస్తుంది. తీర్పు చెబుతూ న్యాయమూర్తి సైతం ఆ మాటే అన్నారు. అంతేతప్ప, మీడియాలో సాగుతున్న ప్రచారం సహా ఇతరేతర కారణాలను బట్టి శిక్షపై నిర్ణయం తీసుకోవడం జరగదు. కాబట్టి, తగినంత బలమైన సాక్ష్యాధారాలు లేనందు వల్లనే ఈ కేసులో నేరస్థుడికి కోర్ట్ మరణశిక్ష విధించలేదా అన్నది ఆలోచించాల్సిన అంశం. తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ ఆ అంశంపై మరింత స్పష్టత రాదు. ఆస్పత్రి సిబ్బంది భద్రత కోసం పనిచేయాల్సిన వాలంటీర్ రాయ్ అసలు తన ఉద్యోగ ధర్మాన్నే మంటగలిపి, కాపాడాల్సిన డాక్టర్నే కాటేశాడన్నది చేదు నిజం. అతడు చేసిన నేరం ఘోరం, హేయమన్నదీ నిర్వివాదాంశం. అయితే, హత్యాచారానికి పాల్పడ్డ సదరు నేరస్థుడు జీవితంలో మారే అవకాశం లేదంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదించలేక పోయింది. ఆ మాటను నిరూపించలేక పోయింది. అది కూడా శిక్ష విషయంలో నేరస్థుడికి కలిసొచ్చిందని నిపుణుల మాట.కోల్‌కతా కేసు దర్యాప్తు ఆది నుంచి అనుమానాలకు తావివ్వడం దురదృష్టకరం. నిజానిజా లేమో కానీ, అత్యంత హేయమైన ఈ ఘటనలో శిక్షపడ్డ నేరస్థుడే కాక, ఇంకా పలువురి హస్తం ఉంద నేది అందరి నోటా వినిపిస్తున్న మాటే. స్థానిక పోలీసుల నుంచి చివరకు సీబీఐ చేతుల్లోకి దర్యాప్తు వెళ్ళినా జనంలో అనుమాన నివృత్తి కాలేదన్నది నిష్ఠురసత్యం. సీసీ టీవీ దృశ్యాల్లో 68 దాకా రాకపోకలు కనిపించినా, రాయ్ ఒక్కరినే గుర్తించారన్న ఆరోపణలే అందుకు సాక్ష్యం. పనికి మాలిన రీతిలో దర్యాప్తు జరిగిందనీ, పలుకుబడి గల బడాబాబులు తప్పించుకున్నారనీ, ఆఖరికి ఒకడే నేర స్థుడని తీర్మానించి యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారనీ విమర్శలు వెల్లువెత్తడానికి కారణమూ అదే. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సహా పలువురి వ్యవహారశైలి, ఆశ్రిత పక్ష పాతం, అవినీతి ఆరోపణలు, ఆస్పత్రి యంత్రాంగం పనితీరు, వగైరా... ఎన్నో ప్రశ్నల్ని ముందుకు తెచ్చాయి. సాక్ష్యాధారాల తారుమారు యత్నంలో ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసినా, నిర్ణీత 90 రోజుల వ్యవధిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోయే సరికి నిష్పూచీగా ఆయన బయటకొచ్చారంటే మన నిఘా, దర్యాప్తు సంస్థలు ఎంత ఘనంగా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కీలకమైన మరో విషయం – ఈ ఘటనకు కారణమైన పరిస్థితులు. ప్రగతి బాటలో ముందున్నా మనే దేశంలో... పనిప్రదేశాల్లో సైతం మహిళలకు రక్షణ కొరవడడం, ఉద్యోగస్థలాలు స్త్రీలకు సురక్షితంగా లేకపోవడం శోచనీయం. కోల్‌కతా ఘటనతో పార్టీలు, ప్రజలు కదం తొక్కిన మాట నిజమే కానీ, ఇప్పటికైనా ఈ పరిస్థితుల్ని సమూలంగా మార్చాల్సిన అవసరం పాలకులకుంది. అవినీతి పంకిలమై, లోపభూయిష్ఠంగా నడుస్తున్న అనేక వ్యవస్థల్ని చక్కదిద్దాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే కోర్టులు ఉన్నంతలో సత్వర న్యాయం అందించడం, ప్రజాభిప్రాయం కన్నా ప్రత్యక్ష సాక్ష్యాలే ప్రాతి పదికగా తీర్పులివ్వడం ఆహ్వానించదగ్గదే. అయితే, చాలా సందర్భాల్లో న్యాయం చెప్పడమే కాదు... న్యాయమే చేస్తున్నట్టు కనిపించడం ముఖ్యం. ఈ కేసులో అది జరిగిందా అన్నదే పలువురి ప్రశ్న. -
ఏ వాస్తవాలు దాచడానికి?
లక్షలాది మంది భారతీయ మహిళల లాగే, నేను ఆగ్రహంతో రగిలిపోయాను, విచారంతో కుంగిపోయాను. ఒక యువతిని తన పని ప్రదేశంలో బహుశా ఆమెకు తెలిసిన పురుషులే క్రూరంగా హింసించి చంపారనే ఆలోచన నన్ను వెంటాడుతోంది. కోల్‌కతా యువ వైద్యు రాలిపై లైంగిక దాడి ఘటనలో, ఆమె శవం గురించి ఇప్పుడు మనకు తెలిసిన భయానక వివరాలను నేను చెప్పలేను. అర్ధనగ్నంగా కనిపించింది. ఆమె కాళ్లు విరిగిపోయాయి. ఆమె జననాంగాలు, రెండు కళ్ల నుంచి విపరీతంగా రక్తస్రావం అయ్యింది. తల నుంచి పాదాల వరకు రక్త సిక్త గాయాలయ్యాయి. ఈ సాక్ష్యం సామూహిక అత్యాచారం అని వైద్యులు నమ్ముతున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని చూడటానికి మూడు గంటలు వేచిచూడాల్సి వచ్చిన తండ్రి ఈ వివరాలను పంచుకున్నారు. ఆ తండ్రిగా మిమ్మల్ని ఊహించుకోండి. అది మీ బిడ్డ గురించి మీకు ఉన్న చివరి జ్ఞాపకం అని ఆలోచించండి.కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన, సంస్థా గతంగా స్త్రీల పట్ల ఉన్న ద్వేషానికీ, దుర్మార్గానికీ భయంకరమైన ఉదాహరణ. అత్యాచారం తర్వాత ఏమి జరిగిందనేది మరింత అసహ్యకరమైనది. జరిగిన ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు నేరాన్ని మరింతగా పెంచాయి.ఈ కేసును అర్థం చేసుకోవాలంటే, మనం వైద్య కళాశాల ప్రిన్సిపల్, ఇప్పుడు తొలగించబడిన సందీప్ ఘోష్ అనే వ్యక్తి గురించి మాట్లాడాలి. మొదట, మెడికల్ కాలేజీ అధిపతిగా, దాడి జరగడానికి ఆయనే జవాబుదారీగా ఉంటాడు. ప్రత్యేకించి ఇది బయటి వ్యక్తి చేసిన పని కాదనీ, కాలేజీ లోపలి వారు చేసిన పనేననీ వైద్యులు చెబుతున్నారు. 36 గంటల షిఫ్ట్ ముగించు కున్న తర్వాత బాధితురాలు విశ్రాంతి తీసుకుంటున్న సెమినార్ హాల్ ఎక్కడ ఉందో బయటి వ్యక్తికి తెలిసే అవకాశం లేదని వైద్యులు సూచిస్తున్నారు. లైంగిక దాడికి, హత్యకు గురైన రాత్రి బాధితురాలి కారును కూడా ధ్వంసం చేశారని నిరసన తెలిపిన వైద్యులు చెబుతున్నారు.ఆమెకు ఏదో తెలిసివుండటం వల్ల ఆమె నోటిని శాశ్వతంగా మూసివేశారా? సందీప్ ఘోష్ మొదట తన వ్యాఖ్యలలో ఆమెను నిందించాడు. ఆ రాత్రి సమయంలో సెమినార్ హాల్లో ఆమె ఉండటాన్ని తప్పు పట్టాడు. ఆ నిర్లిప్తత సరిపోనట్లు, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అధికారులు ఆమె కుటుంబానికి తమ కుమార్తె ఆత్మహత్యతో చనిపోయిందని చెప్పారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని నయవంచన. అసలు ఆమె కుటుంబంతో ఘోష్ వ్యక్తిగతంగా ఎందుకు సమాచారం పంచుకోలేదు? పైగా మౌనంగా ఉండేందుకు పోలీసులు తమకు డబ్బు ఇవ్వజూపారని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు.దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, యువ వైద్యురాలు తన కుమార్తె లాంటిదని ఆయన ఆ తర్వాత పేర్కొన్నప్పటికీ,ఈ అంశంపై ఘోష్ కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. వెంటనే ఆయన పోలీసులను ఎందుకు పిలిపించలేదు? కోల్‌కతా హైకోర్టు కూడా ఇప్పుడు ఆయన ప్రవర్తనపై ఈ ప్రశ్ననే లేవ నెత్తింది.ఈ విచిత్రమైన ప్రతిస్పందనలు సాక్ష్యాలను తారుమారు చేశాయనే అనుమానాలను మరింతగా పెంచాయి. నేరం జరిగిన స్థలానికి చాలా సమీపంలో సాధారణ నిర్మాణపని, మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు చూపించే వీడియో కనిపించింది. ఫోరె న్సిక్స్ కోసం ఆ ప్రాంతాన్ని రింగ్ ఫెన్స్ చేయాలని ఘోష్ అను కోలేదా? తన మొత్తం ఆలోచన అంతా సాక్ష్యం ఎట్టి పరిస్థితు ల్లోనూ దొరకకూడదనే కోణంలో ఉండిందా?ఇంత దారుణ ఘటన నేపథ్యంలో ఘోష్‌ను కనీసం పదవి నుండి తొలగిస్తారని మీరు అనుకుంటారు. బదులుగా ఏమి జరిగిందో ఊహించండి. ఆయన మరొక మెడికల్ కాలేజీకి అధిపతిగా బదిలీ చేయబడ్డారు. అయితే ఈ కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఆయన కార్యాలయానికి తాళం వేసి ఉంచడమే కాకుండా, అతగాడి కొత్త మాయవేషాలను ప్రారంభించడానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు మరో ఉద్యోగం ఎందు కిచ్చారు? అంతే కాదు, ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ నాయకులు... ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి... విద్యార్థులతో మాట్లాడటానికి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి వచ్చి ఘోష్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిలిపివేయమని కోరినట్లు పశ్చిమ బెంగాల్ మీడియా నివేదించింది.ఘోష్‌ను అంత శక్తిమంతంగా మార్చింది ఏమిటి? ఆయన గతంలో వివాదాల మధ్యనే మూడుసార్లు బదిలీ చేయబడ్డాడు. విద్యార్థులు, వైద్యులు ఆయన్ని ఒక విధమైన స్థానిక మాఫియాగా పేర్కొంటారు. ఎట్టకేలకు అతడిని హైకోర్టు తొలగించింది. అతని పక్షాన వాదించడానికి ప్రభుత్వ న్యాయవాదిని ఎందుకు పంపారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఇతర ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులపై దాడికి దుండగులను ఎవరు పంపారు?బాధితురాలి పట్ల వ్యవహరించిన విధంగానే తమపై కూడా అత్యాచారం చేస్తామని ఆకతాయిలు బెదిరించారని నర్సింగ్ సిబ్బంది నాతో అన్నారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయా రనీ, దీంతో తమను తామే రక్షించుకోవలసి వచ్చిందనీ నేను మాట్లాడిన యువ మహిళా వైద్యులు చెప్పారు. ఆకతాయిలు ఎమర్జెన్సీ గదిని ధ్వంసం చేయడంతో సహా కనుచూపు మేరలో ఉన్నవన్నీ ధ్వంసం చేయడాన్ని వాళ్లు చూశారు. బోల్తా పడిన ఆంబులెన్స్‌ని చూశారు. హాస్టల్లోకి ప్రవేశించడానికి పురుషులు పైపులు, గోడల మీదుగా పైకి ఎగబాకటం చూశారు.ఈ ఆకతాయిలు ఎవరనేది బయటపడినప్పటికీ, ఈ దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వృత్తిపర మైన కలల కోసం స్త్రీలు వెయ్యిమంది రాక్షసులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. వారి పని ప్రదేశం కూడా సురక్షితంగా లేక పోతే, ఉద్యోగాల్లో చేరేలా అది మహిళలకు ప్రేరణనివ్వలేదు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అపోలో హాస్పిటల్స్ చేతికి ‘కోల్‌కతా’ ఆస్పత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తూర్పు రాష్ట్రాల్లో మరింతగా కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో పాక్షికంగా నిర్మించిన ఓ ఆస్పత్రిని కొనుగోలు చేసింది. ఫ్యూచర్ ఆంకాలజీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి తమ అనుబంధ సంస్థ అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ రూ. 102 కోట్లకు ఈ హాస్పిటల్‌ను కొనుగోలు చేసినట్లు సంస్థ వెల్లడించింది. కోల్‌కతా ప్రాంతంలో అపోలో హాస్పిటల్‌కు ఇది రెండో ఆస్పత్రి కాగా, తూర్పు ప్రాంతంలో అయిదోది. దీనితో కోల్‌కతా, భువనేశ్వర్, గువాహటివ్యాప్తంగా 1,800 పైచిలుకు పడకలతో అతిపెద్ద హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలమని తెలిపింది. తూర్పు రాష్ట్రాల్లో వచ్చే 3 ఏళ్ల వ్యవధిలో పడకల సంఖ్యను మరో 700 మేరకు పెంచుకోనున్నామని, తద్వారా సదరు ప్రాంతంలో మొత్తం పడకల సంఖ్య 2,500కి చేరగలదని వివరించింది. తాజాగా కొనుగోలు చేసిన సోనార్‌పూర్‌లో ఆస్పత్రిని 325 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో తొలి దశ కింద 1.75 లక్షల చ. అ. విస్తీర్ణంలోని 225 పడకలు వచ్చే 12 నెలల్లో అందుబాటులోకి రాగలవని సంస్థ ఎండీ సునీతా రెడ్డి తెలిపారు. అధునాతన సాంకేతికతతో అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అపోలో హాస్పిటల్స్‌ను రెండు దశాబ్దాలపైగా కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు. -
ఆసుపత్రిలో మాయమైన రోగి వేలు
కలకత్తా : కలకత్తాలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి వేలు కోల్పోయాడు. ఎడమ చేతి వేలు కాస్తా తెగిపడటంతో అతను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అయితే సర్జరీ చేసే సమయంలో డాక్టర్లు ఆ వేలును పోగొట్టారు. తెగిన వేలును ఓ శుభ్రమైన ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఆసుపత్రి యజమాన్యానికి అప్పగించామని, అయినా, ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ చూస్తూ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శస్త్రచికిత్స చేసే సమయంలో తెగిన వేలు పోయిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలకత్తాకు చెందిన నీలోత్పాల్ చక్రవర్తి(38) హౌరా జిల్లాలో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన కార్యాలయం సమీపంలో ప్రమాదానికి గురవ్వడంతో అతని ఎడమ చేతి వేలు కాస్తా తెగిపోయింది. వెంటనే సహోద్యోగులు స్థానిక ప్రవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తెగిపోయిన వేలును ఓ ప్లాస్టిక్ సంచిలో వేసి ఆసుపత్రి యజమాన్యానికి అప్పజెప్పారు. అయితే డాక్టర్లు చికిత్స చేసే ముందు ఆ వేలును పోగొట్టారు. కేవలం ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే తన భర్త వేలు పోయిందని బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆ తెగిన వేలు పనికిరానిదని, తిరిగి అతికించడం కూడా సాధ్యం కాదని ఆస్పత్రి సిబ్బంది వాదిస్తున్నారు. అయినా వేలు పోవడంపై దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు. అయితే, తెగిన వేలును శుభ్రమైన పాలిథిన్ సంచిలో ఉంచి.. మంచులో భద్రపరిచినట్టయితే.. దానిని తిరిగి అమర్చే అవకాశం ఉంటుందని, ప్రస్తుత కేసులో తెగిపడిన వేలు రక్తంతో తడిసి ఉందని, దాన్ని మళ్లీ అతికించినా ప్రయోజనం ఉండదని ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జన్ అనుపమ్ చెబుతున్నారు. ఒకవేళ వేలు అతికించినా, అతికే అవకాశం కేవలం పది శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. ఆస్పత్రిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించనున్నారు. -
కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం
-
ఆస్పత్రిలో మహిళపై సామూహిక అత్యాచారం
కోల్‌కతా: బంధువును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు ఉద్యోగులు లైంగికదాడికి పాల్పడ్డారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. పశ్చిమబెంగాల్లోని ముషీరాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి శుక్రవారం కోల్‌కతా వచ్చింది. తన బంధువును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. ఈ రోజు రాత్రి ఆస్పత్రిలో పనిచేసే లిఫ్ట్మన్, మరో ఉద్యోగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు మసూమ్ అలీ ఖాన్, హైదర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో పనిచేసే మహిళా సిబ్బంది, మహిళా రోగులు భయపడుతున్నారు. మహిళలకు భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
రోగి కపాలం ముక్క పోగొట్టిన ఆస్పత్రి!!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. రూబీ ప్రభుత్వాస్పత్రిలో శస్త్రచికిత్స చేయడానికని ఉంచిన 23 ఏళ్ల యువకుడి కపాలం ముక్క ఒకటి మాయమైపోయింది. ఆ యువకుడికి గత జనవరిలో అదే ఆస్పత్రిలో మెదడుకు శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో కపాలంలో కొంత భాగాన్ని తీశారు. దాన్ని మళ్లీ అమర్చాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఆ కపాలం ముక్క కాస్తా కనపడకుండా పోయిందని అక్కడి న్యూరోసర్జన్లు చెబుతున్నారు. ఇక వేరే మార్గం ఏమీ లేకపోవడంతో.. కృత్రిమ కపాలం ముక్కను అమరుస్తామని చెబుతున్నారు. అర్ణబ్ దత్తా (23) అనే యువకుడు.. తన తండ్రి మరణించడంతో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని గత సంవత్సరం జనవరిలో లేక్ గార్డెన్స్ అపార్టమెంట్ పైనుంచి కిందకు దూకాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న అతడి తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే రూబీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి తలకు శస్త్రచికిత్స చేశామని, కపాలంలో కొంతముక్క తీసి.. తర్వాత అమరుస్తామని వైద్యులు చెప్పారు. తీరా ఇప్పుడు వెళ్తే.. ఆ ముక్క కనిపించడంలేదని అన్నారు.