ఎమ్మెల్యే రేప్ కేసు; నలుగురు మహిళల అరెస్ట్ | Woman held for forcing girl into sex with Bihar MLA | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రేప్ కేసు; నలుగురు మహిళల అరెస్ట్

Published Fri, Feb 26 2016 11:18 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్(ఫైల్) - Sakshi

ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్(ఫైల్)

పాట్నా: బాలికపై ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ అత్యాచారం కేసులో నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశారన్న ఆరోపణలతో సులేఖా దేవి అనే మహిళను నలంద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె తల్లి రాధా దేవి, చెల్లెలు తులసీ దేవి, కుమార్తె ఛోటి కుమారిలతో పాటు మోతి రాము అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నలంద ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కుమార్ ఆశిష్ తెలిపారు.

హిల్సా పోలీసు స్టేషన్ పరిధిలోని ఖద్దీ గ్రామంలో వీరిని పట్టుకున్నట్టు తెలిపారు. ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ ను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేను పట్టుకోవడంలో వైఫల్యం చెందడంతో అంతకుముందున్న ఎస్పీని ప్రభుత్వం బదిలీ చేసింది. రెండు రోజుల క్రితమే నలంద ఎస్పీగా కుమార్ ఆశిష్ బాధ్యతలు చేపట్టారు.

ఫిబ్రవరి 6న బాలికపై రాజ్ బల్లాబ్ అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదు కావడంతో ఆయన పరారయ్యాడు. ఆర్జేడీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. ఆయన పెట్టుకున్న ముందుస్తు బెయిల్ పిటిషన్ ను స్థానిక కోర్టు తిరస్కరించింది. సాక్ష్యాలు నాశనం చేశారన్న ఆరోపణలతో రాజ్ బల్లాబ్ కుమారుడిని కూడా గతవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement