రాఖీ గిఫ్ట్: బస్సుల్లో ఉచిత ప్రయాణం
రాఖీ గిఫ్ట్: బస్సుల్లో ఉచిత ప్రయాణం
Published Fri, Aug 4 2017 12:10 PM | Last Updated on Mon, Aug 27 2018 3:32 PM
లక్నో : ఉత్తరప్రదేశ్ మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రక్షాబంధన్ కానుక ఇచ్చారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని మహిళలు ఆ రోజు ఉచితంగా ఎక్కడికైనా బస్సులో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా టిక్కెట్ కొనకుండా ఆగస్టు 6 అర్థరాత్రి నుంచి ఆగస్టు 7 అర్థరాత్రి వరకు మహిళలు ఈ ఉచిత రైడ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు, రవాణా కార్పొరేషన్‌కు యోగిఆదిత్యానాథ్ ఆదేశాలు జారీచేసినట్టు అధికారులు తెలిపారు.
ఉచితంగా బస్సులో మహిళలు సురక్షితంగా ప్రయాణించేలా రక్షణ కల్పించాలని ఆ రాష్ట్రప్రభుత్వం పోలీసులను కూడా ఆదేశించింది. సంఘవ్యతిరేక కార్యకలాపాలతో వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పోలీసులు సాయపడాలన్నారు. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్, యూపీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన యోగి ఆదిత్యానాథ్ ఈ ప్రకటన చేశారు.
Advertisement
Advertisement