యశ్వంత్, శత్రుఘ్నల ‘రాష్ట్ర మంచ్‌’. | yeswanth sinha fired on bjp | Sakshi
Sakshi News home page

యశ్వంత్, శత్రుఘ్నల ‘రాష్ట్ర మంచ్‌’.

Published Wed, Jan 31 2018 1:39 AM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్ల స్థాయికి తెచ్చిందని బీజేపీ అసమ్మతి ఎంపీ యశ్వంత్‌ సిన్హా మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం తప్పుడు లెక్కలను బీజేపీ చూపుతోందన్నారు. బీజేపీకి చెందిన మరో ఎంపీ శత్రుఘ్న సిన్హా సహా పలువురు నేతలతో కలసి ‘రాష్ట్ర మంచ్‌’ అనే రాజకీయ వేదికను యశ్వంత్‌ సిన్హా మంగళవారం ప్రారంభించారు.

రాష్ట్ర మంచ్‌ అనేది పార్టీయేతర రాజకీయ కార్యాచరణ బృందమనీ, ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదనీ, కేవలం దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని యశ్వంత్‌సిన్హా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తాము ఉద్యమం చేపడతామన్నారు.    కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీ, ఆప్‌ ఎంపీలు వరసగా రేణుకా చౌదరి, దినేశ్‌ త్రివేది, మజీద్‌ మెమన్, సంజయ్‌ సింగ్‌లతోపాటు గుజరాత్‌ మాజీ సీఎం సురేశ్‌ మెహతా తదితరులు కూడా రాష్ట్ర మంచ్‌ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement