
యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ మృతి
అయ్యంగార్ యోగా అనే ప్రత్యేక యోగా పద్ధతిని కనుగొన్న ప్రముఖ యోగా గురువు పద్మ విభూషణ్ బీకేఎస్ అయ్యంగార్ పుణెలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఆయన వయసు 95 సంవత్సరాలు.
అయ్యంగార్ యోగా అనే ప్రత్యేక యోగా పద్ధతిని కనుగొన్న ప్రముఖ యోగా గురువు పద్మ విభూషణ్ బీకేఎస్ అయ్యంగార్ పుణెలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. అయ్యంగార్కు ఊపిరి పీల్చుకోవడంలో సమస్య రావడంతో గత మంగళవారం ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం నాడు మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఆయనకు డయాలసిస్ చేశారు.
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన ఆయనకు 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, ఈ సంవత్సరం ఆరంభంలో పద్మవిభూషణ్ సత్కారాలు లభించాయి. ఆయన యోగా గురించి అనేక పుస్తకాలు కూడా రాశారు. అయ్యంగార్ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అయ్యంగార్ అభిమానులకు సంతాపం తెలిపారు. అయ్యంగార్ సేవలు కొన్ని తరాల పాటు గుర్తుండిపోతాయని, ప్రపంచంలోని చాలామందికి ఆయన యోగాను పరిచయం చేశారని ఆయన అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)
I am deeply saddened to know about Yogacharya BKS Iyengar's demise & offer my condolences to his followers all over the world.
— Narendra Modi (@narendramodi) August 20, 2014