యోగా గురువుకు గూగుల్ సెల్యూట్ | google celebrates bks iyengar birth anniversary | Sakshi
Sakshi News home page

యోగా గురువుకు గూగుల్ సెల్యూట్

Published Mon, Dec 14 2015 8:59 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

యోగా గురువుకు గూగుల్ సెల్యూట్

యోగా గురువుకు గూగుల్ సెల్యూట్

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ జయంతి సందర్భంగా గూగుల్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. కర్ణాటకకు చెందిన బెల్లూరు కృష్ణమాచార్ సుందరరాజ అయ్యంగార్ 97వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ తన లోగోలో ఒక 'ఓ' అనే అక్షరాన్ని తీసి.. ఆ స్థానంలో అయ్యంగార్ యోగా చేస్తున్నట్లు ఉన్న బొమ్మను పెట్టింది.

అయ్యంగార్ యోగా పేరుతో బీకేఎస్ అయ్యంగార్ ప్రవేశపెట్టిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం లభించింది. 1918లో కర్ణాటకలో పుట్టిన అయ్యంగార్.. 2014 ఆగస్టు 20వ తేదీన పుణెలో మరణించారు. పద్మశ్రీ నుంచి పద్మ విభూషణ్ వరకు అన్ని రకాల అవార్డులు ఆయనను వరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement