లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. దేశంలోని ప్రతి ఓటరు చూపుడు వేలు ఇంక్‌తో మెరిసే తరుణమిది. ఈ ప్రజాస్వామ్య పండుగ గూగుల్‌కు కొత్త శోభ తెచ్చింది. ఇంక్ అద్దిన వేలుతో సరికొత్త గూడుల్‌ను గూగుల్ సెర్చ్ పేజీపై ప్రదర్శిస్తోంది.
దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నాల్గవ దశ ఓటింగ్ ప్రారంభమైంది. అదనంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలు, ఒడిశాలోని 28 స్థానాలకు కూడా ఈరోజు పోలింగ్ జరగనుంది. 4వ దశ ఎన్నికలలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలలో నాల్గవ దశ ఓటింగ్‌పై నేటి గూగుల్ డూడుల్ భారత్‌లోని యూజర్లకు మాత్రమే కనిపిస్తుంది. అంతకుముందు, ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీలలో జరిగిన మునుపటి దశల పోలింగ్ అప్పుడు కూడా ఇంక్డ్ ఫింగర్ ఐకాన్ లోగోతో గూగుల్ డూడుల్ మెరిసింది.
ఈరోజు పోలింగ్ జరుగుతన్న మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లో 8, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్‌లో 1 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment