నామమాత్రపు నిధులిచ్చారు: విజయ సాయిరెడ్డి
న్యూఢిల్లీ : ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఉన్నత విద్యాసంస్థలకు కేంద్రం అరాకొర నిధులు విడుదల చేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి తప్పుబట్టారు. ఆయన సోమవారం రాజ్యసభలో మాట్లాడుతూ ఎలాంటి సౌకర్యాలు లేకుండానే ఏపీలో ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని అన్నారు. 12 వందల కోట్లు నుంచి రూ.2,500 కోట్లు అవసరం అయితే కేవలం నామమాత్రపు నిధులు ఇచ్చారని ఆయన అన్నారు. ఆ నిధులతో విద్యా ప్రమాణాలు కాపాడటం సాధ్యం కాదన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకు 85 శాతం సీట్లు కేటాయించాలని విజయ సాయిరెడ్డి డిమాండ్ చేశారు.