
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ఆర్మూర్ నుంచి శుక్రవారం రాత్రి నిజామాబాద్‌కు 24.30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం బస్తాలతో వస్తున్న టీఎస్16 యూబీ 3872 నంబరు గల వ్యాన్‌ను రాష్ట్ర టాస్క్‌ఫోర్స్, జిల్లా సివిల్ సప్లయి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఆర్మూర్ నుంచి వ్యాన్‌ను వెంబడించగా నిజామాబాద్ బైపాస్ రోడ్డు వరకు వచ్చిన డ్రైవర్ అధికారుల రాకను గమనించి రోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు.
అయితే వ్యాన్‌లో 55 బస్తాలతో ³పీడీఎస్ బియ్యం ఉండగా, బస్తాలను నిజామాబాద్ ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు. వ్యాన్‌ను నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అయితే ఆర్మూర్ నుంచి నిజామాబాద్ మీదుగా పీడీఎస్ బియ్యంతో వెళ్తున్న వ్యాన్ ఎక్కడి నుంచి వస్తుంది? సంబంధిత వ్యక్తులెవరు? వ్యాన్ ఎవరిది..? డ్రైవర్ ఎవరనే దానిపై ఒకటి, రెండు రోజుల్లో విచారించి వివరాలను తెలుసుకుంటామని డీఎస్‌వో కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. పీడీఎస్ బియ్యంను పట్టుకున్న వారిలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ డీటీ శంకర్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment