శాక్రమెంటోలో ఘనంగా బతుకమ్మ వేడుకలు | Bathukamma Celebrations held in Sacramento | Sakshi
Sakshi News home page

శాక్రమెంటోలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Published Tue, Oct 15 2019 6:02 PM | Last Updated on Tue, Oct 15 2019 6:58 PM

Bathukamma Celebrations held in Sacramento - Sakshi

నటోమాస్ గ్రూప్ ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగను శాక్రమెంటోలో ఘనంగా నిర్వహించారు. తెలుగుతనం ఉట్టిపడే విధంగా సంప్రదాయ దుస్తులలో దాదాపు 1000 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేదపండితులు గౌరమ్మకు పూజలు నిర్వహించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ రాగయుక్తంగా మహిళలు ఆడుతూ, పాడుతూ చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమం సొంతఊరిలోని పండుగ వాతావరణాన్ని తలపించింది. 

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ జానపద గాయకుడు డాక్టర్ శ్రీనివాస్ లింగా తనదైన బాణీలతో శ్రోతలను అలరించారు. స్థానికంగా ఉన్న చిన్నారుల నృత్యవిన్యాసాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. ఈ బతుకమ్మ వేడుకలకు ప్రధాన కర్త అయిన వెంకట్ మేచినేని మాట్లాడుతూ.. తమ తోటి స్నేహితులు, ఆప్తుల అండదండలతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రం ద్వారా ఎంతో ఆనందాన్ని, అనుభూతులను, మధురస్మృతులను పొందామని, అందరు సుఖ సంతోషాలతో జీవించాలని అందుకు దేవతల అనుగ్రహము ఉంటుందని నమ్ముతూ, ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement