సెయింట్ లూయిస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు | Diwali Celebrations held in St Louis | Sakshi
Sakshi News home page

సెయింట్ లూయిస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

Published Sat, Nov 2 2019 8:30 PM | Last Updated on Sat, Nov 2 2019 9:23 PM

Diwali Celebrations held in St Louis - Sakshi

సెయింట్ లూయిస్ : అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను లిండ్బర్గలోని షామినాడ్‌ కాలేజిలో సెయింట్‌ లూయిస్‌ తెలుగు అసోషియేషన్ వారు నిర్వహించగా.. కోటి మ్యూజికల్ నైట్ తెలుగువారిని ఆనంద ఢోలికల్లో ముంచెత్తింది. దాదాపు రెండు వేలమందికిపైగా  తెలుగువారు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఏఎస్ తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ దీపావళి పురస్కారాలను ప్రకటించింది. తెలుగువారి మేలు కోసం అమెరికాలో వివిధ రంగాలలో కృషి చేస్తున్న ప్రముఖులకు ఈ పురస్కారాలను ప్రధానం చేశారు. అమెరికాలో పలు సేవా కార్యక్రమాలను చేసినందుకుగాను నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడిని దీపావళి పురస్కారంతో సత్కరించారు.

అదేవిధంగా నాట్స్ మెడికల్ క్యాంపుల ద్వారా స్థానిక తెలుగువారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ రమా అట్లూరిని కూడా టీఏఎస్ దీపావళి పురస్కారాలతో సత్కరించింది. వీరితో పాటు స్థానిక టెంపుల్ ట్రస్టీ మాజీ ఛైర్మన్ జీవీ నాయుడు, రాజ్యలక్ష్మి, ప్రస్తుత టెంపుల్ బోర్డ్ ఛైర్మన్ రజనీ కాంత్ గంగవరపు, పీజీఎన్ ఎఫ్ పౌండర్స్ శ్రీనివాస్ గుల్లపల్లి, చిన్నా ముచ్చెర్ల, కూచిపూడి ఛారిటబుల్  ట్రస్ట్ సుజాత ఇంజమూరి తదితరులకు దీపావళి పురస్కారాలు వరించాయి. టెంపుల్ డోనర్, కమ్యూనిటీ సర్వీస్ అవార్డును శ్రీథర్ కొత్తమాసుకు అందించారు.

ఈ పురస్కారాలన్నీ  టీఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ గౌని, సెక్రటరీ రమేశ్ కొండ ముట్టి, కల్చరల్ సెక్రటరీ అర్చన ఉపమాక, ట్రెజరర్ రంగ సురేశ్, బోర్డ్ ఆఫ్ ఛైర్మన్ కుమార్ రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస భూమా, జగన్ వేజండ్ల, జితేంద్ర ఆలూరి, రాకేశ్ గజగౌని చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లకు, ఈ వేడుకలకు స్పాన్సర్ గా వ్యవహారించిన వారికి సెయింట్ లూయిస్ తెలుగు అసోషియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement