
అట్లాంటా : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 40 మంది భద్రతాదళ సభ్యల ప్రాణాలను బలిగొన్న తీవ్రవాదుల అమానవీయ ఘటన యావత్ దేశాన్నీ కుదిపేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అట్లాంటాలో వీరసైనికులకు ప్రవాసాంధ్రులు నివాళులు అర్పించారు. దాదాపు 1000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వ అధికారులు, అమెరికా చట్టసభలకు చెందిన అధికారులతో పాటు రిటైర్డ్ నౌకాదళ, వాయుసేన అధికారులు పాల్గొని సైనికుల సేవలను కొనియాడారు. టెర్రరిజం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment