
శివ ప్రసాద్ రెడ్డి కొలగట్ల(ఫైల్ ఫోటో)
ఒహియో : భారత సంతతికి చెందిన శివ ప్రసాద్ రెడ్డి కొలగట్ల(46) ఒహియోలో క్యాన్సర్‌తో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఆయన ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడిన ఎందరో భారత విద్యార్థులకు సహాయం అందించారు. ఎప్పుడూ అందరితో కలివిడిగా ఉంటూ, చిరునవ్వుతూ పలకరించే తమ స్నేహితుడు శివ మరణం తీరని లోటని ఎన్‌ఆర్‌ఐలు పేర్కొన్నారు. 1998లో శివప్రసాద్‌రెడ్డికి హేమతో వివాహం జరిగింది. అనురాగ్, హర్ష ఇద్దరు కుమారులున్నారు. ఐఐటీ కాన్పుర్ నుంచి శివ ప్రసాద్ రెడ్డి ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగ రిత్యా 1997లో అమెరికా వెళ్లారు. అనంతరం 1999లో కొలంబస్‌లోని ఒహియోలో స్థిరపడ్డారు. ఫ్రాంక్లిన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా కూడా పొందారు. గ్రిడ్ కంప్యూటింగ్‌లో ఐఈఈఈ పేపర్‌ను పబ్లిష్ చేశారు.
అధునాతన టెక్నాలజీలో నైపుణ్యంతో పాటూ.. ఆటల్లోనూ ముందుండేవారని ఎన్‌ఆర్‌ఐలు తెలిపారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలోనూ ఆసక్తి చూపించేవారన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహియో(టీఏసీఓ) నిర్వహించిన టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ టోర్నమెంట్‌లలో ప్రతిభను కనబరిచి ట్రోపీలను గెలుపొందారు. ఒహియోలో నేషనల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వహించిన హాఫ్ మారథాన్‌ను కూడా పూర్తి చేశారు. మే20న పావెల్‌లోని రూథర్‌ఫర్డ్ ఫ్యునిరాల్ హోమ్స్‌లో సంతాప సభ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment