
అట్లాంటా : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నారు.
అట్లాంటాలోని కమ్మింగ్‌లో అట్లాంటా వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ విభాగం ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రం 6.30 నుంచి 10.30 వరకు జరిగే ఈ వేడుకల్లో వైఎస్ జగన్ అభిమానులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని అట్లాంటా వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ విభాగం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment