అక్షర సూర్యుడు అలిశెట్టి
తన కళ ప్రజల కోసమే అని చివరికంటా నమ్మిన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్. నేడు ఆయన జయంతి వర్థంతి కూడా (12.1.1954 - 12.1.1993). ఆయన జన్మస్థలం కరీననగర్ జిల్లా జగిత్యాల. ఆర్టిస్టుగా ఎదిగిన అలిశెట్టి మొదట్లో జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. జీవిక కోసం ఫొటోగ్రాఫర్‌గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడ లేదు. 1972 నుంచి 1992 వరకు కవిత్వాన్ని ఆశ్వా సిస్తూనే బతికాడు.
తన మొదటి కవితా సంకలనం ఎర్రపావురాలు కాగా, మంటల జెండాలు, చురక లు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభగీతం, సిటీలైఫ్ అనే కవిత్వ సంకలనాలు అచ్చయ్యాయి. అలిశెట్టి 40 ఏళ్ల స్వల్ప వయ సులోనే కన్నుమూశాడు. జగిత్యాలలోని ఆయన మిత్రులు, సన్ని హితులు నేడు అలిశెట్టి విగ్రహావిష్కరణ తలపెడుతున్నారు. విగ్ర హ ఆవిష్కర్త తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జయధీర్ తిరుమలరావు. ముఖ్యఅతిథి అల్లం నారాయణ. అందరికీ ఆహ్వానం.
(నేడు అలిశెట్టి ప్రభాకర్ 61వ జయంతి, 22వ వర్థంతి సందర్భంగా జగిత్యాలలో విగ్రహావిష్కరణ)
- అలిశెట్టి మిత్రులు సన్నిహితులు, జగిత్యాల, కరీంనగర్