Alishetty Prabhakar
-
కొత్త పుస్తకాలు
అభ్యుదయ ప్రేమలు రచన: రంగనాయకమ్మ; పేజీలు: 204(రాయల్ సైజు, హార్డుబౌండు); వెల: 80; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2; ఫోన్: 0866-2431181 ఇందులో, 4 కథలతోపాటు, ‘ప్రేతాత్మల తత్వశాస్త్రం’ మీద రాసిన వ్యాసాలూ, విరసం మీద రాసిన వ్యాసాలూ, పాతవి ఫ్యూడల్నీ, కొత్తవి బూర్జువానీ చూపిస్తాయనీ చెప్పే సినిమా వ్యాసాలూ, ‘వర్గ నిర్మూలన’ లక్ష్యంగా రాసిన వర్గాల-కులాల వ్యాసాలూ మొత్తం కలిపి 27 వ్యాసాలున్నాయి. అలిశెట్టి ప్రభాకర్ కవిత సంపాదకులు: జయధీర్ తిరుమలరావు, నిజాం వెంకటేశం, బి.నర్సన్; పేజీలు: 336; వెల: 150; ప్రతులకు: బి.నర్సన్, 1-1-276/ఎ, ఫ్లాట్ నం.104, ఆర్.కె.అపార్ట్మెంట్స్, స్ట్రీట్ నం.1, చిక్కడపల్లి, హైదరాబాద్-27; ఫోన్: 9440128169 ‘రూపంలో సంక్షిప్తతనీ, వస్తువులో జీవిత విస్తృతినీ, సమాజపు లోతుల్నీ ఇమి’డ్చిన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఇది. ‘ఎర్ర పావురాలు’, ‘మంటల జెండాలు’, ‘చురకలు’, ‘రక్తరేఖ’, ‘సంక్షోభ గీతం’, ‘సిటీ లైఫ్’, ‘మరణం నా చివరి చరణం కాదు’ అన్నింటినీ ఒక చోట కూర్చిన సంకలనం. షేక్స్పియర్ నాటక కథలు కథారూపం: జివిఎల్ నరసింహారావు; పేజీలు: 112; వెల: 80; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, చుట్టుగుంట, విజయవాడ-4; ఫోన్: 0866-2430302 షేక్స్పియర్ నాటకాలను చదవనివాళ్లకు స్థూలంగా వాటి కథేమిటో తెలియజెప్పే పుస్తకం ఇది. ఇందులో ఆరు నాటక కథలు - వెన్నిస్ వర్తకుడు, కింగ్ లియర్, కవల కలకలం, నడిరేయి మిడిమేలం, జూలియస్ సీజర్, మేక్బెత్- ఉన్నాయి. వీటిని, ‘జివిఎల్ సరళంగా సుబోధకంగా తెలుగులో అందిస్తున్నారు’. ‘మనుషుల్లో ప్రాథమికంగా ఉండాల్సిన దయ, కరుణ, ప్రేమలను ఈ కథలు ప్రబోధిస్తాయి’. ఇల్లూ వాకిలి రచన: బి.ఎస్.రాములు; పేజీలు: 184; వెల: 125; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, హైదరాబాద్-68. ఫోన్: 040-24224453 ‘సాహిత్య ప్రయోజనం, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసే’ బి.ఎస్.రాములు ‘ఒక ఉద్యమ భావజాలాన్ని ముందుకు తీసుకు’ పోయే లక్ష్యంతో రాసిన కథలివి. ఇందులో 15 కథలున్నాయి. ఇవి ‘1970 నుండి 2015 దాకా సాగిన తెలంగాణ సామాజిక పరిణామాలను, ఆయా సామాజిక వర్గాల ఉత్థాన, పతనాలను, ఉద్యమ తీరుతెన్నులను, ఒక ప్రత్యేక ప్రాపంచిక దృక్పథంతో చిత్రించాయి’. -
అంతరాంతరాల్లో రగులుతున్న పద్యం
జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి జననం 12 జనవరి 1954 మరణం 12 జనవరి 1993 గుండెనిండా బాధ కళ్లనిండా నీళ్లున్నప్పుడు మాట పెగలదు కొంత సమయం కావాలి. దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధి కావాలి. భారమవుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకింత సాహసం కావాలి. ఉండి ఉండి ఉధృతమయ్యేందుకు ఉద్వేగ భరితమైన సన్నివేశం కావాలి... సరళమైన భాషనుంచి సంక్లిష్టమైన వ్యాకరణంలోకి ప్రవేశించినట్టు కలల వంతెన కూలి కన్నీటి నదిలోకి దూకినట్టు హైదరాబాదనే మానవారణ్యంలోకి అడుగిడి సరిగ్గా ఇప్పటికి పది సంవత్సరాలు మధ్యతరగతి కౌగిట్లోని మాధుర్యం కూడా తరిగిపోయి పరిపరి విధాల మానసిక వేదనతో పాటు పెరిగే ఇద్దరు పిల్లల భారాన్ని మోయటమెలాగనే ఆరాటం మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో మళ్ళీ మళ్ళీ ఊపిరితిత్తుల్లో క్షయ రాజుకోవటం పరిపాటయిపోయింది ... నానించి ఏమీ ఆశించని వాళ్ళే నాకెంతగానో సహకరించారు ‘ఐసోనెక్స్’ నుంచి ‘సైక్లోసెరిన్’ వరకూ ఉచితంగా మందులందించిన మహానుభావులెందరో ఉన్నారు. అయితే నాలోని అరాచకం, వేళకి మందులు వాడని క్రమశిక్షణా రాహిత్యం వల్ల రాను రాను నా శరీరంలోని రోగ నిరోధక శక్తి సన్నగిల్లి ఆరు నెలల్లో అవలీలగా నయం చేసుకోగలిగిన వ్యాధి పదేళ్లు అంచెలంచెలుగా ముదిరి నా రెండు ఊపిరితిత్తుల్ని పాడుచేసింది. దశలవారీగా 45, 60, 90, 120 ఇలా వందలాది స్ట్రెప్టోమైసిన్, క్యానమైసిన్ ఇంజక్షన్లు నా వొంటిమీద స్వైరవిహారం చేసిన ఫలితంగా వ్యాధి సంగతటుంచి భయంకరమైన సెడెఫైక్ట్స్ ప్రారంభమై ఆపాదమస్తకం నా దేహమే ఒక ఆసుపత్రి రోదనగా మారిపోయింది. (చనిపోవడానికి ఆరు నెలల ముందు, ‘సిటీ లైఫ్’ నేపథ్యం పేరిట 1992 జూలైలో అలిశెట్టి రాసిన ముందుమాటలోంచి కొంత భాగం.) -
అక్షర సూర్యుడు అలిశెట్టి
తన కళ ప్రజల కోసమే అని చివరికంటా నమ్మిన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్. నేడు ఆయన జయంతి వర్థంతి కూడా (12.1.1954 - 12.1.1993). ఆయన జన్మస్థలం కరీననగర్ జిల్లా జగిత్యాల. ఆర్టిస్టుగా ఎదిగిన అలిశెట్టి మొదట్లో జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. జీవిక కోసం ఫొటోగ్రాఫర్‌గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడ లేదు. 1972 నుంచి 1992 వరకు కవిత్వాన్ని ఆశ్వా సిస్తూనే బతికాడు. తన మొదటి కవితా సంకలనం ఎర్రపావురాలు కాగా, మంటల జెండాలు, చురక లు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభగీతం, సిటీలైఫ్ అనే కవిత్వ సంకలనాలు అచ్చయ్యాయి. అలిశెట్టి 40 ఏళ్ల స్వల్ప వయ సులోనే కన్నుమూశాడు. జగిత్యాలలోని ఆయన మిత్రులు, సన్ని హితులు నేడు అలిశెట్టి విగ్రహావిష్కరణ తలపెడుతున్నారు. విగ్ర హ ఆవిష్కర్త తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జయధీర్ తిరుమలరావు. ముఖ్యఅతిథి అల్లం నారాయణ. అందరికీ ఆహ్వానం. (నేడు అలిశెట్టి ప్రభాకర్ 61వ జయంతి, 22వ వర్థంతి సందర్భంగా జగిత్యాలలో విగ్రహావిష్కరణ) - అలిశెట్టి మిత్రులు సన్నిహితులు, జగిత్యాల, కరీంనగర్