అభ్యుదయ ప్రేమలు
రచన: రంగనాయకమ్మ; పేజీలు: 204(రాయల్ సైజు, హార్డుబౌండు); వెల: 80; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2; ఫోన్: 0866-2431181
ఇందులో, 4 కథలతోపాటు, ‘ప్రేతాత్మల తత్వశాస్త్రం’ మీద రాసిన వ్యాసాలూ, విరసం మీద రాసిన వ్యాసాలూ, పాతవి ఫ్యూడల్‌నీ, కొత్తవి బూర్జువానీ చూపిస్తాయనీ చెప్పే సినిమా వ్యాసాలూ, ‘వర్గ నిర్మూలన’ లక్ష్యంగా రాసిన వర్గాల-కులాల వ్యాసాలూ మొత్తం కలిపి 27 వ్యాసాలున్నాయి.
అలిశెట్టి ప్రభాకర్ కవిత
సంపాదకులు: జయధీర్ తిరుమలరావు, నిజాం వెంకటేశం, బి.నర్సన్; పేజీలు: 336; వెల: 150; ప్రతులకు: బి.నర్సన్, 1-1-276/ఎ, ఫ్లాట్ నం.104, ఆర్.కె.అపార్ట్‌మెంట్స్, స్ట్రీట్ నం.1, చిక్కడపల్లి, హైదరాబాద్-27; ఫోన్: 9440128169
‘రూపంలో సంక్షిప్తతనీ, వస్తువులో జీవిత విస్తృతినీ, సమాజపు లోతుల్నీ ఇమి’డ్చిన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఇది. ‘ఎర్ర పావురాలు’, ‘మంటల జెండాలు’, ‘చురకలు’, ‘రక్తరేఖ’, ‘సంక్షోభ గీతం’, ‘సిటీ లైఫ్’, ‘మరణం నా చివరి చరణం కాదు’ అన్నింటినీ ఒక చోట కూర్చిన సంకలనం.
షేక్స్‌పియర్ నాటక కథలు
కథారూపం: జివిఎల్ నరసింహారావు; పేజీలు: 112; వెల: 80; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, చుట్టుగుంట, విజయవాడ-4; ఫోన్: 0866-2430302
షేక్స్‌పియర్ నాటకాలను చదవనివాళ్లకు స్థూలంగా వాటి కథేమిటో తెలియజెప్పే పుస్తకం ఇది. ఇందులో ఆరు నాటక కథలు - వెన్నిస్ వర్తకుడు, కింగ్ లియర్, కవల కలకలం, నడిరేయి మిడిమేలం, జూలియస్ సీజర్, మేక్బెత్- ఉన్నాయి. వీటిని, ‘జివిఎల్ సరళంగా సుబోధకంగా తెలుగులో అందిస్తున్నారు’. ‘మనుషుల్లో ప్రాథమికంగా ఉండాల్సిన దయ, కరుణ, ప్రేమలను ఈ కథలు ప్రబోధిస్తాయి’.
ఇల్లూ వాకిలి
రచన: బి.ఎస్.రాములు; పేజీలు: 184; వెల: 125; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, హైదరాబాద్-68. ఫోన్: 040-24224453
‘సాహిత్య ప్రయోజనం, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసే’ బి.ఎస్.రాములు ‘ఒక ఉద్యమ భావజాలాన్ని ముందుకు తీసుకు’ పోయే లక్ష్యంతో రాసిన కథలివి. ఇందులో 15 కథలున్నాయి. ఇవి ‘1970 నుండి 2015 దాకా సాగిన తెలంగాణ సామాజిక పరిణామాలను, ఆయా సామాజిక వర్గాల ఉత్థాన, పతనాలను, ఉద్యమ తీరుతెన్నులను, ఒక ప్రత్యేక ప్రాపంచిక దృక్పథంతో చిత్రించాయి’.
కొత్త పుస్తకాలు
Published Mon, Feb 8 2016 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement