శ్రీ జయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్యమాసం
తిథి బ.పంచమి రా.6.26 వరకు
నక్షత్రం పుబ్బ రా.8.28 వరకు
వర్జ్యం ..లేదు.
దుర్ముహూర్తం ఉ.6.36 నుంచి 8.06 వరకు
అమృతఘడియలు ప.1.20 నుంచి 3.07 వరకు
సూర్యోదయం : 6.37
సూర్యాస్తమయం: 5.38
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: పనులలో తొందరపాటు. బంధువుల నుంచి ఒత్తిడులు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యం.
మిథునం: మిత్రులతో ఆనందంగా గ డుపుతారు. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు మార్పులు.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
కన్య: కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య భంగం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల: వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల క లయిక. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
వృశ్చికం: ఉద్యోగలాభం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత. నూతన విద్యావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకు పరుస్తాయి.
ధనుస్సు: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
మకరం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, శనివారం 10, జనవరి 2015
Published Sat, Jan 10 2015 2:30 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement