శ్రీ జయనామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం, తిథి బ.ద్వాదశి రా.12.17 వరకు
నక్షత్రం అనూరాధ ఉ.6.41 వరకు
తదుపరి జ్యేష్ఠ తె.5.34 వరకు (తె ల్లవారితే ఆదివారం)
వర్జ్యం ప.12.01 నుంచి 1.35 వరకు
దుర్ముహూర్తం ఉ.6.38 నుంచి 8.08 వరకు
అమృతఘడియలు రా.9.10నుంచి 10.43వరకు
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.42
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: స్నేహితులతో వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. పనుల్లో అవరోధాలు. కొన్ని విషయాలలో అంచనాలు తప్పుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు.
వృషభం: ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.
మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. అదనపు ఆదాయం. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దేవాలయ దర్శనాలు.
కర్కాటకం: వ్యవహారాల లో ఆటంకాలు. వృథా ఖర్చులు. రాబడి తగ్గుతుంది. ఆరోగ్య, కుటుంబ సమస్యలు కాస్త చికాకుపరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
సింహం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవరోధాలు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం.
కన్య: సోదరులతో వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కళాకారులకు సన్మానాలు.
తుల: ప్రయాణాలలో అవరోధాలు. పనులు నిదానంగా సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు వ ద్దు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.
వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. అప్పులు తీరతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు.
ధనుస్సు: కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్య సమస్యలు.
మకరం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
కుంభం: కుటుంబ సౌఖ్యం. విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రాబడి తగ్గే అవకాశం. దూరప్రయాణాలు. బంధువులు,స్నేహితులతో కలహాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, శనివారం 17, జనవరి 2015
Published Sat, Jan 17 2015 2:29 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement