గ్రహం అనుగ్రహం, ఆదివారం 11, జనవరి 2015 | Anugramham of the day on Jan 11, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, ఆదివారం 11, జనవరి 2015

Published Sun, Jan 11 2015 2:55 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, ఆదివారం 11, జనవరి 2015 - Sakshi

గ్రహం అనుగ్రహం, ఆదివారం 11, జనవరి 2015

శ్రీజయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్యమాసం; తిథి బ.షష్ఠి రా.8.33 వరకు;
నక్షత్రం ఉత్తర రా.11.00 వరకు
వర్జ్యం ఉ.4.24 నుంచి 6.11 వరకు
దుర్ముహూర్తం సా.4.20 నుంచి 5.10 వరకు;
అమృతఘడియలు ప.3.02నుంచి 4.50 వరకు
సూర్యోదయం: 6.37;
సూర్యాస్తమయం: 5.37
రాహుకాలం:  ఉ.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ఉ.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
 

మేషం: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. విందువినోదాలు. శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. సోదరులు, స్నేహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

మిథునం: కార్యక్రమాలలో ఆటంకాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఉద్యోగ, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం: బంధువులు, స్నేహితులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. దేవాలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వాహనయోగం.

సింహం: అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఆస్తి వివాదాలు. ఉద్యోగాలు, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో ఆటంకాలు.

కన్య: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ప్రయాణాలు. గృహ, వాహనయోగాలు. చర్చలు ఫలిస్తాయి. శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది. కృషి ఫలించదు. సోదరులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలు,  వ్యాపారాలలో అనుకూలత.

ధనుస్సు: ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. బంధువుల చేయూత లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహం. దేవాలయాలు సందర్శిస్తారు. ధన, వస్తులాభాలు.

మకరం: రాబడి తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.

 కుంభం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
 
మీనం: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఇంటిలో శుభకార్యాలు. అదనపు ఆదాయం లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement