గ్రహం అనుగ్రహం, మంగళవారం 13, జనవరి 2015
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్యమాసం, తిథి బ.అష్టమి రా.11.43 వరకు
నక్షత్రం చిత్త తె.3.06 వరకు (తెల్లవారితే బుధవారం)
వర్జ్యం ఉ.9.46 నుంచి 11.30 వర కు
దుర్ముహూర్తం ఉ.8.49 నుంచి 9.39 వరకు
తదుపరి రా.10.50 నుంచి 11.40 వరకు
అమృతఘడియలు రా.8.11నుంచి 9.55వరకు
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం: 5.39
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
వృషభం: ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. బంధువులతో కొద్దిపాటి తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
మిథునం: కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. వృథా ఖర్చులు. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
కర్కాటకం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
సింహం: రాబడికి ఖర్చులు పెరుగుతాయి.దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం. ఆలోచనలు స్థిరంగా ఉండవు.
కన్య: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవదర్శనాలు.
తుల: బంధువులతో వివాదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.
వృశ్చికం: ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
ధనుస్సు: పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆలయ దర్శనాలు. ధనవ్యయం.
మీనం: కొత్త విషయాలు గ్రహిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. మీ అంచనాలు నిజం కాగలవు. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.
- సింహంభట్ల సుబ్బారావు