శ్రీ జయనామ సంవత్సరంఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం, తిథి బ.దశమి రా.1.05 వరకు
నక్షత్రం విశాఖ తె.5.22 వరకు
వర్జ్యం ఉ.10.11 నుంచి 11.51 వరకు
దుర్ముహూర్తం ఉ.10.20 నుంచి 11.10 వరకు
తదుపరి ప.2.45 నుంచి 3.35 వరకు
అమృతఘడియలు రా.8.12 నుంచి 9.43 వరకు
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.41
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మకరసంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం
భవిష్యం
మేషం: కొన్ని కార్యక్రమాలలో జాప్యం. వృథా ఖర్చులు. బంధువులతో స్వల్ప తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహం.
వృషభం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వాహన సౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విందువినోదాలు.
మిథునం: ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం: కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కృషి ఫలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు.
సింహం: కొత్తగా అప్పులు చేస్తారు. పనుల్లో ఒత్తిడులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో ముఖ్య విషయాలు చ ర్చిస్తారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.
తుల: ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. అంచనాలు నిజమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం.
ధనుస్సు: రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో చికాకులు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్య సమస్యలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.
మకరం: ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజకనంగా ఉంటాయి.
కుంభం: కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. గృహయోగం.
మీనం: అంచనాలు తప్పుతాయి. కష్టానికి ఫలితం కనిపించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులు, స్నేహితులతో కొద్దిపాటి తగాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, గురువారం 15, జనవరి 2015
Published Thu, Jan 15 2015 1:36 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement