
గ్రహం అనుగ్రహం, శనివారం, ఫిబ్రవరి 27, 2016
గ్రహం అనుగ్రహం
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి బ.చవితి ఉ.6.05 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం చిత్త సా.4.00 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం రా.10.12 నుంచి 11.57 వరకు, దుర్ముహూర్తం ఉ.6.24 నుంచి 7.56 వరకు, అమృతఘడియలు ఉ.9.00 నుంచి 10.44 వరకు
సూర్యోదయం : 6.24
సూర్యాస్తమయం : 6.01
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక లాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి సహాయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు.
వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
మిథునం: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వస్తు, వస్త్రలాభాలు. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.
కన్య: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
వృశ్చికం: కొన్ని పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు: బంధువులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మీనం: బంధువులతో మాటపట్టింపులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
- సింహంభట్ల సుబ్బారావు