అలుపెరుగని మానవ హక్కుల బాటసారి!!
అది ఆదిలాబాద్ గిరిజన ప్రాంతం అయినా, జమ్మూ కశ్మీర్ అయినా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న బుర్ర రాములు, సమాజానికీ మానవ హక్కుల ఉద్యమానికి ఒక దిక్సూచి. ఆయన ఒక పేద మధ్యతరగతి కుటుంబం లో బుర్ర అయిలయ్య - చంద్రమ్మ దంపతులకు 1954 జూన్ 10న ఖిల్లా వరంగల్‌లో జన్మించారు. తన ప్రాథమిక విద్యను ఖిల్లా వరంగల్‌లోను, ఇంటర్మీడి యెట్ విద్య హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లోనూ, డిగ్రీ విద్యను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోను, ఎం.ఎ. ఎకనామిక్స్‌ను కాకతీయ యూనివర్సిటీలోను, మిగతా ఉన్నత విద్యను యూనివర్సిటీలోనే పూర్తి చేశారు.
కాకతీయ యూనివర్సిటీలో ఎం.ఎ. ఎకనా మిక్స్ చదివిన రోజుల్లో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం లో చేరి అనతి కాలంలో విద్యార్థి నాయకుడుగా ఎదిగాడు. ఆ కాలంలోనే బాలగోపాల్ గారి హక్కుల పోరా టం రాములు సార్‌ని ఎంతో ప్రభావితం చేసింది. యూనివర్సిటీ యూజీఎస్ పోరాటంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాడు. విద్యార్థి సమస్యలపైన పోరాటంలో ముందుండేవాడు. 1984-85 కాలంలో ఎంఎల్ పార్టీ చీలికలు, పీడీఎస్ యూలో చీలికలు ఆయన్ని చాలా మనస్తా పానికి గురిచేశాయి. అనంతరం మానవ హక్కుల పోరాటంలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ పోరాటంలో క్రియాశీలంగా పాల్గొనసాగారు. 1985లో డాక్టర్ రామనాథాన్ని ఆయన క్లినిక్‌లోనే రాజ్యహింసలో భాగంగా మఫ్టీ పోలీ సులు చంపేశారు. ఇదే కాలంలో పలువురు పౌర హక్కుల నేతలను పౌరహక్కుల సంఘం కోల్పోవలసి వచ్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ ఆయన హక్కుల రక్షణలో బాధ్యత వహించారు. రెండు తెలు గు రాష్ట్రాలలోనే కాదు మహా రాష్ర్ట, గుజరాత్ ఇలా అనేక రాష్ట్రాల్లో పౌర హక్కుల పరిరక్షణ కోసం పోరా డారు. తను చదువుకున్న యూనివర్సిటీలోనే అధ్యా పకుడిగా చేరారు. గతంలో విద్యార్థిగా లాఠీ దెబ్బలు తిన్న చోటే ప్రగతిశీల భావాలను వ్యాప్తి చేయడం అరుదు. మరోవైపు తన కుటుంబ కర్తవ్యాలను ఏనాడూ విడనాడలేదు. తన జీవిత భాగ స్వామి స్వరూపమ్మ ఆయనకు ఎనలేని సహ కారాన్ని అందించింది. తన ఇద్దరు కూతుళ్లు జన, రనలపై తన స్వంత అభిప్రాయాలను ఆయన రుద్దలేదు. వారి ఇష్టానుసారంగానే వారి చదువులు కొనసాగాయి. చివరికి వారి జీవిత భాగస్వాములను కూడా వారే ఎంపిక చేసుకున్నారు. తన మార్గదర్శకుడు బాలగోపాల్ మర ణం, సహచరి మరణం ఆయనను మానసికంగా చాలా కృంగదీశాయి. ఈ సమయంలోనే తనకు సోకిన కేన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించలేకపోయారు. పౌరుల హక్కులే తన శ్వాసగా బతికిన ఆయన 2011 మే 14న చనిపోయారు. కుల అడ్డుగోడలను ఛేదించ డంలో మత అంతరాలను ప్రాలద్రోలడంలో, విప్లవ శక్తులను రాజ్యం, బూటక ఎన్‌కౌంటర్ల పేరుతో చంపి నప్పుడు తను ప్రశ్నించే తత్వం ఎన్నదగినది. ఆయన అస్తమయం హక్కుల ఉద్యమానికి తీరని లోటు.
(నేడు బుర్ర రాములు వర్ధంతి)
తోట రాజేశ్ పీవైఎల్ నేత, 9440195160