thota Rajesh
-
మరో సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్
సాక్షి, గుడివాడ/బద్వేల్: సోషల్ మీడియా కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా వేదికపై ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న నెటిజన్లపై చంద్రబాబు సర్కారు కన్నెర్ర జేస్తోంది. పార్టీ మారిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణతో కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన తోట రాజేశ్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే జయరాములు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అంతకుముందు గుడివాడలో హైడ్రామా చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి పోలీసులు పేరుతో ఐదుగురు వ్యక్తులు రాజేశ్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఫోన్ చేసి స్టేషన్‌కు రప్పించారు. గుడివాడ రెండో టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చిన రాజేశ్‌ను రాత్రికి రాత్రే వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు తీసుకెళ్లారు. రాత్రి నుంచి సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. రాజేశ్‌ను రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాజేశ్ అరెస్ట్‌పై అధికారికంగా సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు కూడా రవీంద్ర ఇప్పాల, ఇంటూరి రవికిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్తలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికంగా ఎప్పటికప్పుడు ఎండగడుతున్న నెటిజన్లపై ఏపీ సర్కారు అవలంభిస్తున్న వైఖరిని ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు. -
అలుపెరుగని మానవ హక్కుల బాటసారి!!
అది ఆదిలాబాద్ గిరిజన ప్రాంతం అయినా, జమ్మూ కశ్మీర్ అయినా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న బుర్ర రాములు, సమాజానికీ మానవ హక్కుల ఉద్యమానికి ఒక దిక్సూచి. ఆయన ఒక పేద మధ్యతరగతి కుటుంబం లో బుర్ర అయిలయ్య - చంద్రమ్మ దంపతులకు 1954 జూన్ 10న ఖిల్లా వరంగల్‌లో జన్మించారు. తన ప్రాథమిక విద్యను ఖిల్లా వరంగల్లోను, ఇంటర్మీడి యెట్ విద్య హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లోనూ, డిగ్రీ విద్యను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోను, ఎం.ఎ. ఎకనామిక్స్‌ను కాకతీయ యూనివర్సిటీలోను, మిగతా ఉన్నత విద్యను యూనివర్సిటీలోనే పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఎం.ఎ. ఎకనా మిక్స్ చదివిన రోజుల్లో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం లో చేరి అనతి కాలంలో విద్యార్థి నాయకుడుగా ఎదిగాడు. ఆ కాలంలోనే బాలగోపాల్ గారి హక్కుల పోరా టం రాములు సార్‌ని ఎంతో ప్రభావితం చేసింది. యూనివర్సిటీ యూజీఎస్ పోరాటంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాడు. విద్యార్థి సమస్యలపైన పోరాటంలో ముందుండేవాడు. 1984-85 కాలంలో ఎంఎల్ పార్టీ చీలికలు, పీడీఎస్ యూలో చీలికలు ఆయన్ని చాలా మనస్తా పానికి గురిచేశాయి. అనంతరం మానవ హక్కుల పోరాటంలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ పోరాటంలో క్రియాశీలంగా పాల్గొనసాగారు. 1985లో డాక్టర్ రామనాథాన్ని ఆయన క్లినిక్‌లోనే రాజ్యహింసలో భాగంగా మఫ్టీ పోలీ సులు చంపేశారు. ఇదే కాలంలో పలువురు పౌర హక్కుల నేతలను పౌరహక్కుల సంఘం కోల్పోవలసి వచ్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ ఆయన హక్కుల రక్షణలో బాధ్యత వహించారు. రెండు తెలు గు రాష్ట్రాలలోనే కాదు మహా రాష్ర్ట, గుజరాత్ ఇలా అనేక రాష్ట్రాల్లో పౌర హక్కుల పరిరక్షణ కోసం పోరా డారు. తను చదువుకున్న యూనివర్సిటీలోనే అధ్యా పకుడిగా చేరారు. గతంలో విద్యార్థిగా లాఠీ దెబ్బలు తిన్న చోటే ప్రగతిశీల భావాలను వ్యాప్తి చేయడం అరుదు. మరోవైపు తన కుటుంబ కర్తవ్యాలను ఏనాడూ విడనాడలేదు. తన జీవిత భాగ స్వామి స్వరూపమ్మ ఆయనకు ఎనలేని సహ కారాన్ని అందించింది. తన ఇద్దరు కూతుళ్లు జన, రనలపై తన స్వంత అభిప్రాయాలను ఆయన రుద్దలేదు. వారి ఇష్టానుసారంగానే వారి చదువులు కొనసాగాయి. చివరికి వారి జీవిత భాగస్వాములను కూడా వారే ఎంపిక చేసుకున్నారు. తన మార్గదర్శకుడు బాలగోపాల్ మర ణం, సహచరి మరణం ఆయనను మానసికంగా చాలా కృంగదీశాయి. ఈ సమయంలోనే తనకు సోకిన కేన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించలేకపోయారు. పౌరుల హక్కులే తన శ్వాసగా బతికిన ఆయన 2011 మే 14న చనిపోయారు. కుల అడ్డుగోడలను ఛేదించ డంలో మత అంతరాలను ప్రాలద్రోలడంలో, విప్లవ శక్తులను రాజ్యం, బూటక ఎన్కౌంటర్ల పేరుతో చంపి నప్పుడు తను ప్రశ్నించే తత్వం ఎన్నదగినది. ఆయన అస్తమయం హక్కుల ఉద్యమానికి తీరని లోటు. (నేడు బుర్ర రాములు వర్ధంతి) తోట రాజేశ్ పీవైఎల్ నేత, 9440195160 -
డీ.ఎడ్ కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణ ఏది!
మన పాలక వర్గాలు విద్యను ప్రైవేటీకరించడా నికి ఎప్పటి నుండో కంక ణం కట్టుకున్నాయి. విశా ల ఉద్యమాలు నిర్వహిం చి, పోరాటాలు చేసి, సాధించిన చర్రిత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలది. 1975లో ప్రభుత్వ పాఠశా లలో ఉపాధ్యాయ నియామకాల కోసం, ప్రభుత్వం ఉపాధ్యాయ శిక్షణ కాలేజీలను ప్రారంభించింది. 1990 వరకు ప్రభుత్వ కాలేజీల్లోనే శిక్షణ కొనసాగిం ది. 1991లో మన దేశంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ప్రైవేటీకరణ రంగా న్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. ప్రభు త్వమే విద్యను నిరూపయోగంగా చేస్తోంది. 35 ఏళ్ల క్రితం ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యో గాల భర్తీ ఉండేది. నేడు ప్రభుత్వ రంగసంస్థలు పో యి తాత్కాలిక ఉద్యోగాలు వచ్చాయి. కొత్తగా ప్రభు త్వ ఉద్యోగ నియామకాలు లేవు. ఇప్పుడు రెండు రకాల ఉద్యోగాలే ఉన్నాయి. ఒకటి రక్షణ రంగం అంటే పోలీస్, సైన్యం, రెండోది ఉపాధ్యాయ ఉద్యో గాలు. ఇవే ప్రస్తుతం నిరుద్యోగులకున్న అవకా శాలు. మార్కెట్ సరుకుల వాడకానికి విజ్ఞానం అవ సరం. దాని కోసమే పాలకవర్గాలు విద్యాభివృద్ధికి నిధులను అందిస్తున్నారు. అందులోనూ ప్రాథమిక విద్యారంగాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు డీ.ఎడ్ కాలేజీలు 732 ఉన్నాయి. వీటిలో 102 మైనారిటీ కాలేజీలు, 24 ప్రభుత్వ కాలేజీలు, 18 ఉర్దూ మీడియం కాలేజీలు, 1 తమిళ మీడియం కాలేజీ ఉన్నాయి. వీటి అన్నింటిలో కలిపి సుమారు గా 38,500 సీట్లు ఉన్నాయి. ఇవి ప్రభుత్వం చెప్పే లెక్కలు. అనధికారంగా 952 కాలేజీలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో దాదాపు 35 మాత్రమే ప్రభు త్వ కాలేజీలు. మిగతావి ప్రైవేటు కాలేజీలు. వీటిలో ఒక్కో కాలేజీలో 50 సీట్లు ఉంటాయి. 40 సీట్లు ప్రభుత్వమే కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుంది. మిగ తా 10 సీట్లను ఆ ప్రైవేటు యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో అమ్ముకుంటున్నాయి. నేడు ఒక డీ.ఎడ్ సీటును రెండు లక్షల నుండి రెండు లక్షల 50 వేలకు అమ్ముతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డీ.ఎడ్ విద్యావ్యాపారం జరుగుతున్నా, ప్రభుత్వ అధికా రుల నియంత్రణ ఉండదు. ఇక మైనారిటీ కాలేజీల గురించి ఎంత తక్కు వగా చెబితే అంతమంచిది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 102 మైనారిటీ కాలేజీలు ఉన్నాయి. ఒక్కో కాలేజీలో సుమారు 50 సీట్లు ఉంటాయి. వీటిలో మైనారిటీ వర్గాలకే 95% సీట్లు ఇవ్వాలి. మిగిలిన 5% సీట్లు ఇతరులకు కేటాయించాలి. కానీ, ఈ 45 సీట్లను ఇతర వర్గాలకు ఇస్తున్నారు. వీటికి 1 లక్ష నుండి 2 లక్షల వరకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మైనారిటీ విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూలుచేసి మైనారిటీ సొసైటీల పేరుతో కోట్లకు కోట్లు లాభాలు గడిస్తున్నారు. మైనారిటీ విద్యార్థులు డీ.ఎడ్ విద్యను కొనే ఆర్థిక స్థితి ఉండదు అనేది బహిరంగ రహస్యం. మైనారి టీ విద్యాసంస్థలో మైనారిటీ విద్యాభివృద్ధి శూన్యం. మైనారిటీ కాలేజీలకు అటు ప్రైవేటు డీ.ఎడ్ కాలేజీ లకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండరు. ఎందుకంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వ విద్యాలయాల నుండి కేవలం 300 మంది ఎంఈడీ విద్యార్థులు బయటికి వస్తున్నారు. ప్రైవేట్ మైనా రిటీ డీ.ఎడ్ కాలేజీలో విద్యార్థులకు ఎంఈడీ పూర్తి చేసిన విద్యార్థులు అవసరం. రెండు తెలుగు రాష్ట్రా ల్లో 732 డీ.ఎడ్ కాలేజీలకు దాదాపు 5 వేల మంది ఎంఈడీ ఉపాధ్యాయులు అవసరం. మరి అంత మంది ఎంఈడీ విద్యార్థులు లేనప్పుడు ప్రైవేట్ డీ.ఎడ్ కాలేజీ యాజమాన్యాలు ఏ ఉపాధ్యాయు లను నియమిస్తున్నారు? ఎవరి ద్వారా విద్యాబోధన చేయిస్తున్నారు? కొన్ని కాలేజీలు అధ్యాపకులు లేకుండానే కోర్సు పూర్తి చేస్తున్నాయి. అసలు ఈ బోగస్ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని విశ్వ విద్యాలయా లలోని విద్యాశాఖ వారు పరిశీలిస్తే ప్రైవేట్ మైనా రిటీ కాలేజీల బాగోతం బయటపడుతుంది. ప్రైవేట్ మైనారిటీ కాలేజీల మౌలిక సదుపాయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రైవేటు డీ.ఎడ్ కాలేజీల ఆగడాలను అరికట్టి నియంత్రించాలని ప్రగతిశీల వాదులు కోరుకుంటున్నారు. లేదంటే విద్యార్థులకు పోరాటాలు తప్పవు. (వ్యాసకర్త ప్రగతిశీల యువజన సంఘం నాయకులు, మొబైల్ :94401 95160 తోట రాజేష్