డీ.ఎడ్ కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణ ఏది! | What is the government's control over the college d.ed | Sakshi
Sakshi News home page

డీ.ఎడ్ కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణ ఏది!

Published Tue, Mar 10 2015 12:59 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

డీ.ఎడ్ కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణ ఏది! - Sakshi

డీ.ఎడ్ కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణ ఏది!

మన పాలక వర్గాలు విద్యను ప్రైవేటీకరించడా నికి ఎప్పటి నుండో కంక ణం కట్టుకున్నాయి. విశా ల ఉద్యమాలు నిర్వహిం చి, పోరాటాలు చేసి, సాధించిన చర్రిత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలది. 1975లో ప్రభుత్వ పాఠశా లలో ఉపాధ్యాయ నియామకాల కోసం, ప్రభుత్వం ఉపాధ్యాయ శిక్షణ కాలేజీలను ప్రారంభించింది. 1990 వరకు ప్రభుత్వ కాలేజీల్లోనే శిక్షణ కొనసాగిం ది. 1991లో మన దేశంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్ నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ప్రైవేటీకరణ రంగా న్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. ప్రభు త్వమే విద్యను నిరూపయోగంగా చేస్తోంది.

35 ఏళ్ల క్రితం ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యో గాల భర్తీ ఉండేది. నేడు ప్రభుత్వ రంగసంస్థలు పో యి తాత్కాలిక ఉద్యోగాలు వచ్చాయి. కొత్తగా ప్రభు త్వ ఉద్యోగ నియామకాలు లేవు. ఇప్పుడు రెండు రకాల ఉద్యోగాలే ఉన్నాయి. ఒకటి రక్షణ రంగం అంటే పోలీస్, సైన్యం, రెండోది ఉపాధ్యాయ ఉద్యో గాలు. ఇవే ప్రస్తుతం నిరుద్యోగులకున్న అవకా శాలు. మార్కెట్ సరుకుల వాడకానికి విజ్ఞానం అవ సరం. దాని కోసమే పాలకవర్గాలు విద్యాభివృద్ధికి నిధులను అందిస్తున్నారు. అందులోనూ ప్రాథమిక విద్యారంగాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు డీ.ఎడ్ కాలేజీలు 732 ఉన్నాయి. వీటిలో 102 మైనారిటీ కాలేజీలు, 24 ప్రభుత్వ కాలేజీలు, 18 ఉర్దూ మీడియం కాలేజీలు, 1 తమిళ మీడియం కాలేజీ ఉన్నాయి.  వీటి అన్నింటిలో కలిపి సుమారు గా 38,500 సీట్లు  ఉన్నాయి. ఇవి ప్రభుత్వం చెప్పే లెక్కలు. అనధికారంగా 952 కాలేజీలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో దాదాపు 35 మాత్రమే ప్రభు త్వ కాలేజీలు. మిగతావి ప్రైవేటు కాలేజీలు. వీటిలో ఒక్కో కాలేజీలో 50 సీట్లు ఉంటాయి. 40 సీట్లు ప్రభుత్వమే కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుంది. మిగ తా 10 సీట్లను ఆ ప్రైవేటు యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో అమ్ముకుంటున్నాయి. నేడు ఒక డీ.ఎడ్ సీటును రెండు లక్షల నుండి రెండు లక్షల 50 వేలకు అమ్ముతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డీ.ఎడ్ విద్యావ్యాపారం జరుగుతున్నా, ప్రభుత్వ అధికా రుల నియంత్రణ ఉండదు.

ఇక మైనారిటీ కాలేజీల గురించి ఎంత తక్కు వగా చెబితే అంతమంచిది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 102 మైనారిటీ కాలేజీలు ఉన్నాయి. ఒక్కో కాలేజీలో సుమారు 50 సీట్లు ఉంటాయి. వీటిలో మైనారిటీ వర్గాలకే 95% సీట్లు ఇవ్వాలి. మిగిలిన 5% సీట్లు ఇతరులకు కేటాయించాలి. కానీ, ఈ 45 సీట్లను ఇతర వర్గాలకు ఇస్తున్నారు. వీటికి 1 లక్ష నుండి 2 లక్షల వరకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మైనారిటీ విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూలుచేసి మైనారిటీ సొసైటీల పేరుతో కోట్లకు కోట్లు లాభాలు గడిస్తున్నారు. మైనారిటీ విద్యార్థులు డీ.ఎడ్ విద్యను కొనే ఆర్థిక స్థితి ఉండదు అనేది బహిరంగ రహస్యం.  మైనారి టీ విద్యాసంస్థలో మైనారిటీ విద్యాభివృద్ధి శూన్యం. మైనారిటీ కాలేజీలకు అటు ప్రైవేటు డీ.ఎడ్ కాలేజీ లకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండరు.
 ఎందుకంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వ విద్యాలయాల నుండి కేవలం 300 మంది ఎంఈడీ విద్యార్థులు బయటికి వస్తున్నారు. ప్రైవేట్ మైనా రిటీ డీ.ఎడ్ కాలేజీలో విద్యార్థులకు ఎంఈడీ పూర్తి చేసిన విద్యార్థులు అవసరం. రెండు తెలుగు రాష్ట్రా ల్లో 732 డీ.ఎడ్ కాలేజీలకు దాదాపు 5 వేల మంది ఎంఈడీ ఉపాధ్యాయులు అవసరం.

మరి అంత మంది ఎంఈడీ విద్యార్థులు లేనప్పుడు ప్రైవేట్ డీ.ఎడ్ కాలేజీ యాజమాన్యాలు ఏ ఉపాధ్యాయు లను నియమిస్తున్నారు? ఎవరి ద్వారా విద్యాబోధన చేయిస్తున్నారు? కొన్ని కాలేజీలు అధ్యాపకులు లేకుండానే కోర్సు పూర్తి చేస్తున్నాయి.  అసలు ఈ బోగస్ సర్టిఫికెట్‌ల వ్యవహారాన్ని విశ్వ విద్యాలయా లలోని విద్యాశాఖ వారు పరిశీలిస్తే ప్రైవేట్ మైనా రిటీ కాలేజీల బాగోతం బయటపడుతుంది. ప్రైవేట్ మైనారిటీ కాలేజీల మౌలిక సదుపాయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రైవేటు డీ.ఎడ్ కాలేజీల ఆగడాలను అరికట్టి నియంత్రించాలని ప్రగతిశీల వాదులు కోరుకుంటున్నారు. లేదంటే విద్యార్థులకు పోరాటాలు తప్పవు. 

(వ్యాసకర్త ప్రగతిశీల యువజన సంఘం నాయకులు, మొబైల్ :94401 95160
తోట రాజేష్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement