ఎదుటివాడి మాట వింటాడు! | hears to the other person words | Sakshi
Sakshi News home page

ఎదుటివాడి మాట వింటాడు!

Published Tue, Apr 21 2015 11:59 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

ఎదుటివాడి మాట వింటాడు! - Sakshi

ఎదుటివాడి మాట వింటాడు!

సందర్భం
 

పీవీగారి దగ్గరకు వెళ్లి, ‘‘మా మనుమడు రాజకీయాలలో, అదీ కమ్యూనిస్టు రాజకీయాలలో పడి తిరుగుతున్నాడండి. మీరైనా కాస్త చెప్పండి!’’ అంది. ‘‘కమ్యూనిస్టు అయినా, కాంగ్రెసయినా మీ వాడిలాంటి చదువుకున్నవాళ్లు రాజకీయాలలోకి రావాలమ్మా! మీరేమీ బాధపడకండి!’’ అంటూ ఆయన ఓదార్చారు. సీతారాం జాతీయ రాజకీయాలలో పేరు తెచ్చుకుంటూ, రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు సీపీఎంకి జనరల్ సెక్రటరీ అయ్యాడు. అమ్మ, సుందరయ్యగారు, పీవీ బతికి ఉంటే ఎంత సంతోషించేవారో!
 
సీతారాం మా అమ్మ దగ్గరే పెరిగాడు. మా బావ ఏచూరి సోమయాజులుగారు ఆటోమొ బైల్ ఇంజనీరింగ్ చదివి, ఏపీ ఎస్‌ఆర్టీసీలోను, కేంద్ర ప్రభు త్వంలోను ఉన్నతోద్యోగాలు చే శారు. యునెటైడ్ నేషన్స్ తర ఫున ఉగాండా, భూటాన్‌లలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ ట్రాన్స్‌పోర్ట్ ఆవిర్భావానికి కారకులు. ఆయనకు తర చుగా బదిలీలు అవుతూండటం వల్ల మా మేనల్లుడు సీతారాం, వాడి తమ్ముడు మా అమ్మ దగ్గరే పెరిగారు. అమ్మ దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారికి కుడిభుజం. 1997లో తను చ నిపోయే వరకు ఆంధ్ర మహిళా సభకు ఫౌండర్ ట్రస్టీగా కొనసాగారు. కొంతకాలం ఆంధ్ర యువతీ మం డలి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆవిడతో పరిచయం ఉన్న వాళ్లంతా ఆవిడ డైనమిజంను ఇప్పటికీ గుర్తు పెట్టు కుంటారు. అమ్మ పెంపకం ప్రభావమో ఏమో, సీతారాం ఉన్నతోద్యోగాల కోసం ఆశ పడకుండా సేవాభావంతో ప్రజాజీవితంలోకి వెళ్లాడు. వాళ్లమ్మ- అంటే మా అక్క కల్పకం ఎంఏ చదివింది. భరతనాట్యంలో నిష్ణాతు రాలు. అమ్మలాగే సంఘసేవకురాలు. మహిళా ఉద్య మంలో పాలు పంచుకుంది. ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమైన పదవులలో పనిచేస్తోంది. 80 ఏళ్లు దాటినా ఇప్పటికీ సాంఘిక కార్యకలాపాలలో చురుగ్గా ఉంటుంది.

సీతారాం చదువుకునే రోజులలో కమ్యూనిస్ట్ సంస్థ లలో చురుకుగా తిరుగుతున్నప్పుడు ప్రముఖ కమ్యూ నిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యగారి వద్దకు మా అమ్మ వెళ్లి, ‘‘ఏమండీ! మీకు మా మనుమడు తప్ప వేరెవరూ దొరకలేదా?’’ అని అడిగింది. ఆయన చాలా గడుసుగా ‘‘మీ మనుమడిలాంటి చాకులాంటి కుర్రాణ్ణి ఎవరినైనా అప్పగించి, వాణ్ణి తీసుకుపోండమ్మా!’’ అని జవాబిచ్చారు. మనుమణ్ణి మెచ్చుకున్నందుకు సంతోషిం చాలో, తన మాట విననందుకు బాధపడాలో తెలియ లేదావిడకు. తర్వాత పీవీ నరసింహారావు గారి దగ్గరకు వెళ్లి, ‘‘మా మనుమడు రాజకీయాలలో, అదీ కమ్యూ నిస్టు రాజకీయాలలో పడి తిరుగుతున్నాడండి. మీరైనా కాస్త చెప్పండి!’’ అంది. ‘‘కమ్యూనిస్టు అయినా, కాంగ్రె సయినా మీ వాడిలాంటి చదువుకున్నవాళ్లు రాజకీయా లలోకి రావాలమ్మా! మీరేమీ బాధపడకండి!’’ అంటూ ఆయన ఓదార్చారు. సీతారాం జాతీయ రాజకీయాలలో పేరు తెచ్చుకుంటూ, రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు సీపీ ఎంకి జనరల్ సెక్రటరీ అయ్యాడు. అమ్మ, సుందరయ్య గారు, పీవీ బతికి ఉంటే ఎంత సంతోషించేవారో!

సీతారాం లాంటి మృదు స్వభావి కమ్యూనిస్టు పార్టీలో చేరతాడని మేం అనుకోలేదు. ఆల్ సెయింట్ హైస్కూల్లో చదువుతున్న మా మేనల్లుళ్లలో ఒకడు ఎవరో అబ్బాయిని ఇటుక పెట్టి కొట్టాడని ఫిర్యాదు వచ్చింది. వెళ్లి చూస్తే సీతారాం తమ్ముడు శంకర్! ఎందుకురా కొట్టేవ్? అంటే, ‘వాడు అన్నయ్యను రాయి పెట్టి కొట్టా డ’న్నాడు. దెబ్బ తిన్న సీతారాం ఊరుకున్నాడు, శంకర్ తిరగబడ్డాడు. అలాంటి సీతారాం ఢిల్లీలో సెయింట్ స్టీఫె న్సులో ఎకనమిక్స్  బీఏ ఆనర్స్ చేస్తుండగా, వామపక్ష భావాల వైపు మొగ్గాడు. ఎంఏ చదివాక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నానంటూ ఇం ట్లో చెప్పి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో నాయ కుడైపోయాడు. మా నాన్నగారు కంగారుపడ్డారు. ‘బుద్ధి’ గరపమని నా దగ్గరకు పంపించారు-నాతోబాటు కలసి పెరిగాడు కనుక! ఒక నెల తర్వాత నేను నాన్నకు చెప్పా ను- ‘‘నాన్నా వాడిమాటేమిటో గానీ, వీడు కొన్నిరోజు లు నా దగ్గర ఉంటే నేనూ కలెక్టరు ఉద్యోగం మానేసి కమ్యూనిస్టు కార్యకర్తనవుతానేమో చూసుకో!’’ అని. సీతారాం దగ్గర ఆ చాకచక్యం ఉంది. విపరీతంగా పుస్త కాలు చదువుతాడు. ఫిక్షన్ కూడా. ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా తెలుసుకుంటాడు. గుర్తు పెట్టుకుంటాడు. ప్రాచీన భారత చరిత్ర దగ్గర్నుంచి, అన్నీ కంఠోపాఠం. వాదించేటప్పుడు ఎదుటివారి పాయింట్ శ్రద్ధగా విం టాడు, ఆ కోణంలోంచి కూడా ఆలోచిస్తాడు. చివరకు తను అనుకున్నది దృఢంగా, నొప్పించకుండా చెప్తాడు. భగవంతుడు చక్కటి రూపం ఇచ్చాడు. మంచి కంఠం ఇచ్చాడు. పెదాలపై చిరునవ్వు ఇచ్చాడు. సెన్సాఫ్ హ్యూ మర్ ఇచ్చాడు. ఇంకొకరిని కష్టపెట్టడం ఇష్టపడకపోవ డం ఇచ్చాడు. అందువలన తనకు శత్రువులు లేరు. విభేదించేవారు కూడా గౌరవించే ప్రవర్తన తనది.

నేచెప్పినది విని నాన్నగారు, ‘సరే, వాడి మానాన వాణ్ణి వదిలేయ్’ అన్నారు. కానీ ప్రభుత్వం వదలలేదు. ఎమర్జెన్సీ విధించగానే వాడి కోసం వెతికింది. వాడు అజ్ఞాతవాసం చేస్తూ అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటం సాగించాడు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత వాళ్ల పార్టీ స్థితి మెరుగుపడింది. రాజకీయ పార్టీ లన్నాక ఆటుపోట్లు తప్పవు. తను కూడా దానితో పాటే పొంగుతూ, కుంగుతూ ఉన్నాడు. అవన్నీ వాడు స్పోర్టివ్ గానే తీసుకున్నాడు.

 కాలేజీలో ఉండగా టెన్నిస్ బాగా ఆడేవాడు. ఫర్కుందా ఆలీఖాన్ అనే కోచ్ ‘నువ్వు టెన్నిస్‌లో కొన సాగితే జాతీయ చాంపియన్‌వి కావడం ఖాయం’ అనే వాడు. సీతారాం ఇప్పటికీ టెన్నిస్ ఆడతాడు. ఆ రం గంలో చాంపియన్ కాలేకపోయినా గెలుపోటములు సమానంగా స్వీకరించే క్రీడాస్ఫూర్తి పోగొట్టుకోలేదు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో ‘లెఫ్ట్‌హ్యాండ్ డ్రైవ్’ అనే శీర్షిక నడుపుతూ వ్యాసాలు రాస్తూ ఉంటాడు. లెఫ్ట్ సైడ్ డ్రైవిం గ్ అమెరికాలో రాంగ్ సైడేమో కానీ ఇండియాలో రైట్ సైడే. అది సక్రమమైన మార్గం, అదే అసలైన మార్గం అని నమ్మి ఆ దారినే నమ్ముకున్నాడు.

మనదేశంలో వామపక్షాలు కొంతకాలం కాంగ్రెసే తర కూటాలు ఏర్పరచి, మరికొంతకాలం బీజేపీ వ్యతి రేక కూటాలు ఏర్పరిచి దేశ విధానాలను కొంతమేరకైనా ప్రభావితంచేస్తున్నాయి. వామపక్షాలలో సీపీఎంది ప్రధా న భూమిక. దానిలో సీతారాం యువతకు, నవ్య ధోరణు లకు ప్రతీకగా నిలిచాడు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యక్షంగా గానీ, కార్మిక ఉద్యమాల ద్వారా గానీ తమ ఉనికిని చాటుకుంటు న్నాయి. కొన్ని చోట్ల సొంతబలంతో అధికారంలోనో, మరికొన్ని చోట్ల ప్రజాస్వామ్యవాదులతో కలసి సంకీర్ణం లోనో ఇంకొన్ని చోట్ల ప్రతిపక్షంలోనో ఏదో ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ లోకమంతా విస్తరించి ఉన్నాయి. సామ్య వాదానికి ఒకచోట నూకలు చెల్లాయనుకుంటూండగానే మరొకచోట మోసులు వేస్తోంది. సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం ప్రతిఘటన తప్పదు. అది సాధారణంగా కార్మిక, కర్షక, శ్రామిక ఉద్యమంగా రూపు దిద్దుకుంటుం ది. ఎరుపు రంగు పులుముకుంటుంది. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అది చూపే మొగ్గును బట్టి విశ్వవ్యాప్తంగా బలాబలాలు మారతాయి.

ఇక్కడి కమ్యూనిస్టు పార్టీ ఘన చరిత్ర కలది. కాలం తెచ్చిన మార్పులలో పాయలుపాయలుగా విడిపోయినా విధాన పరమైన విషయాలలో అది ప్రభుత్వం పైన, ప్రజల పైన చూపే ప్రభావాన్నీ, దాని ముఖ్య నాయకుల వ్యక్తిగత ఆలోచనా సరళి ప్రాముఖ్యతనూ విస్మరించలేం. అంద రికీ సన్నిహితునిగానే ఉంటూ, అదే సమయంలో అంద రితో సమానదూరం పాటిస్తూ క్లిష్ట పరిస్థితులలో కూడా చెక్కుచెదరని, నవ్వు చెరగని సీతారాం వంటి స్థితప్రజ్ఞు డు ప్రధాన వామపక్షమైన సీపీఎంకు జనరల్ సెక్రటరీ కావడం వలన దేశానికి కూడా ఎంతో కొంత మేలు కలు గుతుందని ఆశిద్దాం.

 (వ్యాసకర్త విశ్రాంత ప్రధాన కార్యదర్శి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
డా॥మోహన్ కందా
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement