జమ్మూకశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో ఓర్వలేక ఉగ్రవాదులు 11 మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు యువకులను హతమార్చడం దురదృష్టకరం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల పర్యటనకు రెండు రోజుల ముందే ఉగ్రవాదులు ఈ దురాగతానికి పాల్పడటం గమనార్హం. కశ్మీర్‌లో శాంతియుతంగా ఎన్నికలు జరుగుతున్నందువల్ల జీర్ణించుకోలేని ముష్కరులు తమ ఉనికిని చాటుకోవడానికి ఈ దాడులకు పాల్పడ్డారనిపిస్తోంది. భారతదేశంపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న తీవ్రవాదులు ఎంతటి దారుణానికైనా వెనుకాడరనడానికి తాజా దుశ్చర్యే దృష్టాంతం. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దురా గతానికి పాల్పడటం నీతిమాలిన చర్య.
ఉగ్రవాద సంస్థలకు ముగుదాడు వేయకపోతే ముష్కరులు మరింతగా పేట్రేగిపోయే ప్రమాదం ఉంది. మన భూభాగం నుంచి విడిపోయిన ఒక చిన్న దేశం మాటిమాటికీ కయ్యానికి కాలు దువ్వుతూ ఉగ్రవా దానికి వెన్నుదన్నుగా నిలుస్తూ కోట్ల మంది భారతీయుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇంకా ఉపేక్షించడం అర్థరహితం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తీవ్ర చర్యకు సిద్ధపడాలి. సరి హద్దు ఆవల గల ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వ హించాలి. వాటన్నింటినీ ధ్వంసం చేసి పాకిస్తాన్‌కు గట్టి గుణ పాఠం చెప్పాలి.
- బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
Published Sun, Dec 14 2014 3:46 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement