గురునానక్ జన్మదినోత్సవం సందర్భంగా గురుద్వారాకి వెళ్లి సిక్కుల తలపాగా ధరించి, సిక్కులను కూడా కల్యాణలక్ష్మి పథ కంలో చేర్చడానికి తెలంగాణ సీఎం అంగీకరించారు. అయితే పేద, మధ్యతరగతికి చెందిన వారందరినీ, కులాల ప్రస్తావన లేకుండా, కల్యాణలక్ష్మి పథకంలో చేర్చి, వివా హం చేసుకోబోతున్న మహిళలను సీఎం ఆదు కోవాలి. ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందిం చాలి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. టీటీడీ సహకారంతో కల్యాణమస్తు కార్యక్రమం ప్రారంభించి ఎందరో సోదరీమణులకు తాళి భాగ్యాన్ని ప్రసాదిం చిన విషయం ఉమ్మడి రాష్ట్ర ప్రజల జ్ఞాపకాల్లో మిగిలే ఉంది. కల్యాణమస్తు కార్యక్రమంతో ఆయన ప్రభుత్వ ఖర్చుతో వివాహా లు జరిపించారు.
తెలంగాణ సీఎం కూడా కులమతాలకు అతీ తంగా కల్యాణలక్ష్మి పథకం ద్వారా వివాహాలు జరిపించాలి. రాష్ట్రంలోని సిక్కుల కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. హైదరాబాద్‌లో అమృత్‌సర్ తరహా దేవాలయాన్ని నిర్మించి, నగరాన్ని సర్వమత సమ్మేళన కేంద్రంగా మార్చాలి.
-కె.అమన్ రాజీవ్ కుత్బుల్లాపూర్, హైదరాబాద్