కాన్పులదిబ్బ ఆవిష్కరణ | Kanpuladibba book discovered by Chintakindhi srinivasa rao | Sakshi
Sakshi News home page

కాన్పులదిబ్బ ఆవిష్కరణ

Published Mon, Jul 11 2016 12:31 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

Kanpuladibba book discovered by Chintakindhi srinivasa rao

విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో చింతకింది శ్రీనివాసరావు కథలసంపుటి ‘కాన్పులదిబ్బ’ ఆవిష్కరణ సభ జూలై 13న సాయంత్రం 6 గంటలకు విశాఖ పౌర గ్రంథాలయం, ద్వారకానగర్, విశాఖపట్నంలో జరగనుంది. అధ్యక్షత: కె.ఎన్.మల్లీశ్వరి. అతిథులు: కె.శివారెడ్డి, చందు సుబ్బారావు. తొలిప్రతి స్వీకర్త: పైడి వెంకట రమణమూర్తి.
 
ర్యాలి ప్రసాద్ కవితా శతావధానం
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, ఆదిత్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో, ‘మొట్టమొదటి’ వచన కవితా శతావధానం జూలై 16న ఉదయం 10 నుండీ సెమినార్ హాల్, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరంలో జరగనుంది. అవధానకర్త: ర్యాలి ప్రసాద్. ముర్రు ముత్యాలనాయుడు, కె.రమేష్, నగ్నముని, ఎండ్లూరి సుధాకర్, నల్లమిల్లి శేషారెడ్డి, తరపట్ల సత్యనారాయణ పాల్గొంటారు. అవధాన నిర్వాహకులు: వాడ్రేవు వీరలక్ష్మీదేవి, నామాడి శ్రీధర్, దాట్ల దేవదానం రాజు, సన్నిధానం నరసింహశర్మ, మాకినీడు సూర్యభాస్కర్.
 
 కొత్త పుస్తకాలు
ధమ్మపదం:అనువాదం: బెందాళం క్రిష్ణారావు; పేజీలు: 274; వెల: 150; ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ; అనువాదకుడి ఫోన్: 7306434888 ‘బుద్ధుని బోధనల సారాంశమంతా ‘‘ధమ్మపదం’’లోనే ఉందని పండితులంతా అంగీకరిస్తున్నారు. ఇది బుద్ధుని బోధనలను అత్యంత సరళ సుందరమైన శైలిలో ప్రజల మనసులను హత్తుకునే విధంగా అందిస్తుంది. భారతదేశానికి చెందిన అతి ప్రాచీన ధార్మిక గ్రంథాల్లో ‘‘ధమ్మపదం’’ అగ్రగామి’. మాక్స్ ముల్లర్ తన ‘సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్’లో భాగంగా ప్రచురించిన ధమ్మపదాన్ని ప్రామాణికంగా తీసుకుని క్రిష్ణారావు చేసిన స్వేచ్ఛానువాదం ఇది. ‘బౌద్ధసాహిత్యంతో పరిచయం లేనివారికి కూడా సుబోధకంగా ఉండాలన్న లక్ష్యంతో వచన కవితా రూపంలో’ సాగింది.
 ఘంటారావం
 మూలం: ఎర్నెస్ట్ హెమింగ్వే; అనువాదం: అమరేంద్ర; పేజీలు: 414; వెల: 290; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ, హైదరాబాద్-68; ఫోన్: 24224453 హెమింగ్వే ‘ఫర్ వూమ్ ద బెల్ టోల్స్’ నవలకు 1967లో వచ్చిన అనువాదపు పునర్ముద్రణ ఇది. ‘స్పెయిన్‌లో ఫాసిస్టులకూ, కమ్యూనిస్టులకూ జరిగిన సంఘర్షణ ఇందులో ఇతివృత్తం. (నాలుగు రోజులపాటు) ఒక గుహలో కొద్దిమంది స్త్రీ పురుషులతో కథ నడిచినప్పటికీ మొత్తం ఉద్యమమంతా మన కళ్లముందు కదులుతున్నట్లనిపిస్తుంది. ఫాసిస్టుల కిరాతక చర్యలతోపాటుగా, విప్లవకారుల అమానుష కృత్యాలు వర్ణించటంలో హెమింగ్వే ప్రదర్శించిన నిష్పాక్షిక నిర్లిప్త దృష్టి ఉత్తమ రచయితలకే సాధ్యమౌతుంది’.
 
 హాస్యకథలు
 సంకలనం: వియోగి, ఏవిఎమ్; పేజీలు: 400; వెల: 300; ప్రతులకు: ఎస్.ఆర్. బుక్‌లింక్స్, దానయ్య వీధి, మాచవరం, విజయవాడ-4. ఫోన్: 0866-2436959.  ‘హాస్యానికి తక్కువమంది సాహిత్య గౌరవం కలిగిస్తున్నారు’. ‘సహజ హాస్యప్రియులైన వియోగి-ఏవియమ్’ ‘హాస్యకథలకు ప్రాణం పోయాలనే ఏకైక ధ్యేయంతో’ తెచ్చిన సంకలనం ఇది. ఇందులో 50 కథలూ, 12 కార్డు కథలూ, కార్టూన్లూ ఉన్నాయి. ‘పసందైన ఈ కథల కదంబ విందులో కార్డు కథలు కారప్పూసలా కరకరలాడుతూంటే, ఏవియమ్ వ్యంగ్యచిత్రాలు జీడిపప్పుల్లా జిహ్వను సంతృప్తి’ పరుస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement