మిషన్ కాకతీయ.. తెలంగాణ పునర్ జ్ఞాపకం
సందర్భం
చెరువులు పునరుద్ధరణ అనేది గాల్లోంచి ఠక్కున ఊడిపడిన భావన కాదు. ఇది భావుకత కాదు. వాస్తవికతగా మారబోతున్న తెలంగాణ ప్రజల పునర్ జ్ఞాపకం.
గత నెల 2న సాక్షి పత్రిక సంపాదకీయ పేజీలో వచ్చిన బిక్షం గుజ్జాగారి వ్యాసం ‘మిష న్ కాకతీయ: భావుకత-వాస్త వికత’ వ్యాసం కాస్త ఆలస్యం గా నా దృష్టికి వచ్చింది. మిష న్ కాకతీయ కార్యక్రమం అమ లులో మొదటినుంచి భాగస్వా మిగా ఉన్న నాకు ఆయన పాఠ కుల్లో సృష్టించిన గందరగోళాన్ని తొలగించాల్సిన అవస రం ఉందనీ, ఈ విశిష్ట పథకంపై ఆయన చేసిన అలవోక వ్యాఖ్యలను, సూత్రీకరణలను పూర్వపక్షం చేయవలసిన అవసరం ఉందనిపించింది. అందుకే ఈ ప్రతిస్పందన.
భిక్షం గారు ప్రస్తావించిన అంశాలను చర్చించేముం దు మిషన్ కాకతీయ భావన ఎలా రూపొందిందో, దీనికి ఎలాంటి మేధోమథనం జరిగిందో తెలియాలి. మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) అనేది గాల్లోంచి ఠక్కున ఊడిపడిన భావన కాదు. అది తెలంగాణ ఉద్య మ ఆకాంక్ష. తెలంగాణ గ్రామీణ ఆర్థిక, సామాజిక, సాం స్కృతిక వికాసానికి అనాది ఆధారాలుగా ఉన్న గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ గత పాలకుల విధానపరమైన నిర్ల క్ష్యం కారణంగా విధ్వంసం అయిపోయిందన్న విషయం బిక్షంగారికి తెలియంది కాదు. తెలంగాణ భౌగోళిక పరి స్థితులకు అనుగుణంగానే కాకతీయులు, వారి తర్వాతి పాలకులైన కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, సంస్థానా ధీశులు తెలంగాణలో వేలాది చెరువులను నిర్మించి వ్యవ సాయ విస్తరణకు తోడ్పాటును అందించారు. అవి తెలంగాణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి కూడా దోహదం చేసినాయని చెప్పాలి. భూస్వామ్య అణిచివేత కొనసాగినప్పటికీ, వేలాది చెరువుల నిర్మా ణం వల్ల తెలంగాణలో కరువుకాటకాలు అరుదుగా వచ్చే వి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 33,000 లకు పైగా చెరు వులు, కుంటల కింద 12 లక్షల ఎకరాలకు పైగా భూమి సాగులో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ చెరువులేని గ్రామం లేకపోగా, ఒకటి కంటే ఎక్కువ చెరువులు ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి.
1969 తెలంగాణ ఉద్యమాన్ని పరిశీలిస్తే, ఆనాడు ఉద్యోగాలు, నిధుల దోపిడీనే ప్రధానాంశంగా ఉండేది. నీరు ఇంకా ఒక సమస్యగా ముందుకురాని పరిస్థితి, ఎం దుకంటే తెలంగాణలో చెరువులు ఇంకా ఆనాటికి బతికే ఉన్నాయి. ఎనభైల నాటికి చెరువుల వ్యవస్థ విధ్వంసం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. తొంభైలనాటికి అదొక సంక్షోభంగా మారింది. అటు చెరువుల విధ్వంసం, ఇటు కొత్త ప్రాజెక్టుల కింద పారకం అభివృద్ధి కాకపోవడంతో తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం తారాస్థాయికి చేరు కున్నది. దీంతో ఒకనాటి స్వయంపోషక తెలంగాణ గ్రా మాలు రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారాయి.
అందుకే తొంభైలలో మళ్లీ పురుడుపోసుకున్న ఉద్యమా నికి నీరే ప్రధాన ప్రాతిపదిక అయింది. తెలంగాణ భౌగో ళిక అనివార్యత గనుకనే టీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రణా ళికలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలుప రుస్తానని వాగ్దానం చేసింది. అధికారంలోకి రాగానే చెరువుల పునరుద్ధరణకు పూనుకుంది. ముఖ్యమంత్రి కేసీ ఆర్, సాగునీటి శాఖ పరిధిలో అనేక చర్చలు, సమీ క్షలు తర్వాతే మిషన్ కాకతీయ కార్యక్రమం సిద్ధమైంది.
మిషన్ కాకతీయ కార్యక్రమం రూపొందిన ఈ పరి ణామక్రమంలో బిక్షం గారన్నట్లుగా పిసరంత భావుకత లేదు. ఇది ఉద్యమ ఆకాంక్షను వాస్తవికతగా మార్చడా నికి అకుంఠిత దీక్షతో ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ. గతంలో అమలైన పథకాలను సమీక్షించాలని ఆయన పేర్కొన్నారు. గతంలో అమలు చేసిన ఆర్‌ఆర్ పనులను, జైకా, ప్రపంచ బ్యాంకు పనులను నిత్యం సమీక్షిస్తూ గత లోపాలు పునరావృతంకాకుండా ఇంజనీ ర్లకు సూచనలు జారీచేస్తున్నాము.
‘నాటి చెరువునే కోరుకుంటున్నామంటే పెను మార్పులకు గురైన సమాజంలో మారిన ఆర్థిక వాస్తవిక తలో ఒక నిర్దిష్ట సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించ డానికి ప్రయత్నిస్తున్నామన్నమాట’ అని బిక్షంగారంటు న్నారు. నాటికీ, నేటికీ భూసంబంధాల్లో మార్పు వచ్చి నా, చెరువు యాజమాన్య పద్ధతులను ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్చుకునే అవసరాన్ని ప్రభుత్వం గుర్తిం చింది. చెరువు కాకుండా ఎలాంటి సాగునీటి వ్యవస్థను తెలంగాణలో పునరుద్ధరించాలో వ్యాసకర్త సెలవిస్తే బాగుండేది.
‘...చెరువులు పూడికతీత, తవ్వడం, కట్టలను, గట్ల ను బలోపేతం చేయడం, మూలజలాన్ని శుద్ధి చేయడం ద్వారా ఏదో జరిగిపోతుందని అనుకుంటే.. అమాయక త్వమే’ అని అంటున్నారు బిక్షంగారు. అంతర్జాతీయ జలనిర్వహణ నిపుణుడైన ఆయన ఇంత అమాయక సూత్రీకరణ చేయడమే ఆశ్చర్యకరం. చెరువున్న గ్రామా ల్లో, లేని గ్రామాల్లో తాగునీటి సమస్యపై తులనాత్మక అధ్యయన రికార్డులు భూగర్భ జలశాఖ వద్ద ఉన్నాయి. వాటిని ఎవరైనా పరిశీలించి నిర్ధారించుకోవచ్చు. దీనిపై బిక్షం గారి వ్యాఖ్య అభ్యంతరం, అశాస్త్రీయం కూడా.
చివరగా.. ‘ఈ ప్రాజెక్టుల లక్ష్యసాధనలో ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రజలు సందేహిస్తున్నారు...’ అన్నారు. ప్రజలకేమో గానీ బిక్షంగారికే ఈ సందేహం ఉన్నట్లుంది. మొన్ననే సౌదీ నుంచి మోహన్ బానోత్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. సౌదీలో ఆయన డ్రైవర్‌గా వెయ్యి రియాళ్లకు (రూ.12,000లు) పనిచేస్తున్నాడు. తనది కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, నూకలమర్రి గ్రామం. ‘లొంక చెరువులకు నీల్లు వస్తే మా ఊల్లె యవుసం లేస్తది. మేమందరం మా ఊల్లెకు వాపసు వస్తం. ఊరికి దూరంగా, భార్యాపిల్లలకు దూరంగా బతుకుడు కష్టం గా ఉన్నది సారు. చెరువుల నీల్లుంటే మా ఊల్లెనే యవు సం చేసుక బతుకుతం సారు. మా ఊరి చెరువును బాగు చెయున్రి’ అని చెప్పినాడు. నా కండ్లు చెమ్మగిల్లినాయి. ఇలాంటి లక్షలాది వలస జీవులు గ్రామాలకు తిరిగివస్తే ఈ కార్యక్రమం జయప్రదం అయినట్లే. మిషన్ కాక తీయ మోహన్ బానోత్ లాంటి తెలంగాణ బిడ్డల కోస మే బిక్షంగారు. ఇది భావుకత కాదు. వాస్తవికతంగా మారబోతున్న తెలంగాణ ప్రజల పునర్ జ్ఞాపకం.
(వ్యాసకర్త ఒ.ఎస్.డి, తెలంగాణ సాగునీటి శాఖ మొబైల్: 9491060585)
శ్రీధర్‌రావు దేశ్‌పాండే