Sridhar Rao Deshpande
-
మిషన్ కాకతీయ’పై కథనాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జన జీవనంపై ‘మిషన్ కాకతీయ’ప్రభావంపై కథనాలు పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే కోరారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు పత్రికలు, టీవీ చానళ్లలో ప్రచురితమైన, ప్రసారమైన కథనాలు ఎంట్రీలుగా స్వీకరిస్తామని బుధవారం తెలిపారు. వచ్చే జనవరి 31 వరకు పంపొచ్చన్నారు. పంటల దిగుబడులు, రసాయనిక ఎరువుల వాడకం, వలసలు, చెరువుల చరిత్రపై పరిశోధన, విశ్లేషణ, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ఉపాధి కల్పన, ఫ్లోరోసిస్ నివారణ, భూగర్భజలాలు, ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు, సాంస్కృతిక విధానం వికాసం అంశాలపై పంపాలని తెలిపారు. వీటిని సచివాలయం ‘డి’బ్లాక్‌లోని ఓఎస్డీ కార్యాలయంలో ఇవ్వొచ్చని.. లేదంటే శ్రీధర్‌రావు దేశ్ పాండే, ఓఎస్డీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డి బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, సెక్రటేరియట్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపాలని సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల్లో మూడేసి చొప్పున బహుమతులు ఉంటాయని, మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో బహుమతి కింద రూ.75 వేలు, మూడో బహుమతి కింద రూ.50 వేలు అందజేస్తారని తెలిపారు. ‘భగీరథ’ ఆలస్యంపై ఈఎన్సీ అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మిషన్ భగీరథ పనులను సమీక్షించారు. కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆర్డబ్ల్యూఎస్ విభాగం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విశ్వసనీయతకు భంగం కలిగించే ఏ వర్క్ ఏజెన్సీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఓ వైపు డిసెంబర్ 31 వస్తున్నా కాంట్రాక్టర్లు ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పైప్‌లైన్ గ్యాప్‌లను పూడ్చడం ద్వారా చాలా గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయవచ్చని, ఆ చిన్న పనులను కూడా ఏజెన్సీలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. డిసెంబర్ 31 నాటికి గ్రామాలకు శుద్ధిచేసిన తాగునీటిని అందించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఏజెన్సీలు తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కోదండపూర్ డబ్ల్యూటీపీలో ఎలక్ట్రో మెకానికల్ పనులు చేస్తున్న ఏజెన్సీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మల్లన్నసాగర్‌పై మరో కుట్ర
సందర్భం డ్యాంలని నదికి అడ్డంగా నిర్మించాలే తప్ప నది లేనిచోట నిర్మించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవంటున్నారు మల్లన్నసాగర్ విమర్శకులు. రాయలసీమలో నదిలేనిచోట వాగులపై ఎక్కువ నిల్వ సామర్థ్యంతో కట్టిన జలాశయాల మాటేంటి? టీజేఏసీ వారు కొన్ని నెలల క్రితం ‘‘ కాళేశ్వరం లిఫ్ట్ ఇరి గేషన్ ప్రాజెక్ట్ – విల్ ఇట్ బెనిఫిట్ తెలంగాణ?’’ పేరుతో విడుదల చేసిన నివేదికలో మల్లన్నసాగర్ జలాశయం ప్రాంతంలో పగుళ్ల గురించి ప్రస్తావించి ఉన్నారు. వాటిని తిరిగి ఇటీవల కోదండరాం చర్చకు తీసుకు వచ్చినారు. పగుళ్ళు ఉన్న ప్రాంతంలో 50 టీఎంసీ జలాశయాన్ని ఎట్లా నిర్మిస్తారని ప్రశ్నిస్తు న్నారు. పగుళ్లపై సమగ్ర అధ్యయనం జరపాలని, అంత వరకు ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలవద్దని, భూసేక రణ చెయ్యవద్దని అంటున్నారు. ఆయన ప్రకటనలని జేఏసీ సభ్యులు కొందరు ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. పైన పేర్కొన్న నివేదికలో రచయితలు చేసిన వాదన ఏమిటంటే... సాధారణంగా డ్యాంలని నదీ ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం కూడెల్లి వాగుకు సమాం తరంగా నిర్మిస్తున్నారు. దీని వలన మట్టి కట్ట నుంచి ఎక్కువ నీరు బయటకు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి బురద భూమిగా మారుతుంది. మల్లన్నసాగర్ డ్యాం నిర్మిస్తున్న ప్రాంతంలో భూగర్భంలో డ్యాంకు సమాంతరంగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. డ్యాంలో 40– 60 మీటర్ల ఎత్తులో నీరు నిలిచి ఉంటుంది కనుక ఈ నీటి బరువుకి భూగర్భంలో ఉన్న పగుళ్ళు మరింత వెడల్పు అయి ఎక్కువ నీరు బయటకు పోతుంది. దీంతో మట్టి కట్ట క్రమేణా కొట్టుకుపోయి లక్షలాదిమంది ప్రజలు ఆస్తి, ప్రాణ నష్టానికి గురి అవుతారు. అందుకని డ్యాం నిర్మాణ స్థలంపై మరింత పరిశోధన అవసరం. రచయితలు ఈ రకమైన నిర్ధారణకు ఏ భూ భౌతిక పరిశోధనల ఆధారంగా వచ్చినారో ఎక్కడా పేర్కొన లేదు. ఇది కూడా వారి ఊహాగానమే తప్ప శాస్త్రీయ పరిశోధనపై ఆధారపడి చేసిన నిర్ధారణ కాదు. వారు చెప్పినట్లు కూడెల్లి వాగు మల్లన్నసాగర్ డ్యాంకు బయట నుంచి సాగిపోతున్నది. డ్యాంలైన్‌కి అతి దగ్గరగా ఉన్న ప్పుడు దూరం 300 మీటర్లు ఉంటుంది. అదికూడా 34 కి.మీ పొడవున ప్రవహించే కూడెల్లి వాగుకు ఈ స్థితి 5 కి.మీ మాత్రమే ఉంటుంది. దీనివలన మల్లన్నసాగర్ డ్యాంకు ఏ ప్రమాదమూ లేదు. డ్యాంని డిజైన్ చేసేట ప్పుడు నీటి ఒత్తిడితో పాటు భూకంపాల నుండి విడు దల అయ్యే శక్తిని కూడా పరిగణిస్తారు. డ్యాం నిర్మిం చేటప్పుడు పునాది తవ్వుతారు. సమగ్రమైన భూభౌతిక పరిశోధనల అనంతరం సీఓటీ ఎంత లోతుకు తవ్వాలో నిర్ధారిస్తారు. తవ్విన పునాదిలో నీటిని అతి తక్కువగా పీల్చుకునే గుణం కలిగిన మట్టినే నింపుతారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతం మధ్యలో ఉన్న వేములఘాట్ గ్రామంలో ఉన్న కోమటి చెరువు, దాని కింద ఉన్న నల్ల చెరువులో ఈ పగుళ్ళ కారణంగా పెద్ద ఎత్తున నీరు బయటకు పోయి చెరువుల్లో నీటి నిల్వ వేగంగా తగ్గిపోయిన అనుభవాలు గతంలో ఎప్పుడూ లేవు. కాబట్టి ఇది ఊహాగానమే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ చేత రికన్నాయిజన్స్ సర్వే, లైడార్ సర్వే నిర్వహించింది ప్రభుత్వం. వారి సర్వేలో ఎక్కడా జలా శయం ప్రాంతంలో గాని, కూడెల్లి వాగు పరీవాహక ప్రాంతంలో గానీ పగుళ్ళు ఉన్నట్టు తేలలేదు. ఇక దేశంలో భూకంపాల చరిత్రను పరిశీలిస్తే తెలం గాణలో భూకంపాలు వచ్చిన దాఖలాలు లేవు. భూకంపాలని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు దేశాన్ని మొత్తం 5 జోన్లుగా వర్గీకరించినారు. దక్కన్ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశాలు లేనందున ఈ ప్రాంతాన్ని భూకంప ప్రాంతాల వర్గీకరణ చేసిన ప్పుడు అతి తక్కువ అవకాశాలు ఉన్న జోన్ 1,2, 3లో చేర్చినారు.అందులో 80% తెలంగాణ జోన్ 1,2లో ఉంటే 20% జోన్ 3లో ఉన్నది. అత్యధిక భూకంపాలు సంభవించే అవకాశాలు జోన్ 4, 5లోనే ఉన్నాయి. ఇక మల్లన్నసాగర్ నిర్మించబోతున్న మెదక్ జిల్లా జోన్ 2లో ఉన్నదన్న సంగతి ప్రజలు గమనించాలి. డ్యాంలని నదికి అడ్డంగా నిర్మించాలే తప్ప ఈ రకంగా నది లేనిచోట నిర్మించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు అంటున్నారు మల్లన్నసాగర్ విమర్శకులు. ఎక్కడో ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నది లేని చోట, లేదా చిన్నవాగులపై అవి సమకూర్చే నీటి పరిమాణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నిల్వ సామ ర్థ్యంతో నిర్మించిన జలాశయాలు రాయలసీమలో ఉన్నాయి. బ్రహ్మంగారి మఠం జలాశయం ఆ కోవలో నిదే. వాటి వివరాలు చూడండి. కండలేరు–68 టీఎం సీలు, గోరకల్లు–10 టీఎంసీలు, వెలిగొండ–41 టీఎం సీలు, వెలుగోడు–17 టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం– 17 టీఎంసీలు, అవుకు–7 టీఎంసీలు, అలుగునూరు–3 టీఎంసీలు. ఇవన్నీ నదులు లేని చోట నిర్మించినవి కావా? అవ సరమైతే కృత్రిమ జలాశయాలు నిర్మించుకోవాలంటూ కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ఎత్తిపోతల పథకాలలో పెద్ద జలాశ యాల నిర్మాణం అత్యంత అవసరం. సీడబ్ల్యూసీ సూచ నల మేరకే 50 టీఎంసీలతో రీ డిజైన్ చేయడం తప్ప నిసరైంది. నది లేని చోట డ్యాం నిర్మిస్తున్నారని విమర్శి స్తున్న వారు.. పైన పేర్కొన్న జలాశయాలు నిర్మిస్తున్న ప్పుడు కిక్కురుమనలేదెందుకు? ఇప్పుడు అటువంటిదే మల్లన్నసాగర్ జలాశయం నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభు త్వం ఏదో నేరం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. తెలం గాణకు జీవధారగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టుని వరుస కుట్రలతో అడ్డుకునే ప్రయత్నాలను వమ్ము చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో తెలంగాణ ఇంజనీర్లు తమ మేధస్సును, చెమటను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారు. - శ్రీధర్‌రావు దేశ్‌పాండే వ్యాసకర్త కో చైర్మన్, తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ -
మిషన్ కాకతీయ.. తెలంగాణ పునర్ జ్ఞాపకం
సందర్భం చెరువులు పునరుద్ధరణ అనేది గాల్లోంచి ఠక్కున ఊడిపడిన భావన కాదు. ఇది భావుకత కాదు. వాస్తవికతగా మారబోతున్న తెలంగాణ ప్రజల పునర్ జ్ఞాపకం. గత నెల 2న సాక్షి పత్రిక సంపాదకీయ పేజీలో వచ్చిన బిక్షం గుజ్జాగారి వ్యాసం ‘మిష న్ కాకతీయ: భావుకత-వాస్త వికత’ వ్యాసం కాస్త ఆలస్యం గా నా దృష్టికి వచ్చింది. మిష న్ కాకతీయ కార్యక్రమం అమ లులో మొదటినుంచి భాగస్వా మిగా ఉన్న నాకు ఆయన పాఠ కుల్లో సృష్టించిన గందరగోళాన్ని తొలగించాల్సిన అవస రం ఉందనీ, ఈ విశిష్ట పథకంపై ఆయన చేసిన అలవోక వ్యాఖ్యలను, సూత్రీకరణలను పూర్వపక్షం చేయవలసిన అవసరం ఉందనిపించింది. అందుకే ఈ ప్రతిస్పందన. భిక్షం గారు ప్రస్తావించిన అంశాలను చర్చించేముం దు మిషన్ కాకతీయ భావన ఎలా రూపొందిందో, దీనికి ఎలాంటి మేధోమథనం జరిగిందో తెలియాలి. మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) అనేది గాల్లోంచి ఠక్కున ఊడిపడిన భావన కాదు. అది తెలంగాణ ఉద్య మ ఆకాంక్ష. తెలంగాణ గ్రామీణ ఆర్థిక, సామాజిక, సాం స్కృతిక వికాసానికి అనాది ఆధారాలుగా ఉన్న గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ గత పాలకుల విధానపరమైన నిర్ల క్ష్యం కారణంగా విధ్వంసం అయిపోయిందన్న విషయం బిక్షంగారికి తెలియంది కాదు. తెలంగాణ భౌగోళిక పరి స్థితులకు అనుగుణంగానే కాకతీయులు, వారి తర్వాతి పాలకులైన కుతుబ్‌షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానా ధీశులు తెలంగాణలో వేలాది చెరువులను నిర్మించి వ్యవ సాయ విస్తరణకు తోడ్పాటును అందించారు. అవి తెలంగాణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి కూడా దోహదం చేసినాయని చెప్పాలి. భూస్వామ్య అణిచివేత కొనసాగినప్పటికీ, వేలాది చెరువుల నిర్మా ణం వల్ల తెలంగాణలో కరువుకాటకాలు అరుదుగా వచ్చే వి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 33,000 లకు పైగా చెరు వులు, కుంటల కింద 12 లక్షల ఎకరాలకు పైగా భూమి సాగులో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ చెరువులేని గ్రామం లేకపోగా, ఒకటి కంటే ఎక్కువ చెరువులు ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి. 1969 తెలంగాణ ఉద్యమాన్ని పరిశీలిస్తే, ఆనాడు ఉద్యోగాలు, నిధుల దోపిడీనే ప్రధానాంశంగా ఉండేది. నీరు ఇంకా ఒక సమస్యగా ముందుకురాని పరిస్థితి, ఎం దుకంటే తెలంగాణలో చెరువులు ఇంకా ఆనాటికి బతికే ఉన్నాయి. ఎనభైల నాటికి చెరువుల వ్యవస్థ విధ్వంసం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. తొంభైలనాటికి అదొక సంక్షోభంగా మారింది. అటు చెరువుల విధ్వంసం, ఇటు కొత్త ప్రాజెక్టుల కింద పారకం అభివృద్ధి కాకపోవడంతో తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం తారాస్థాయికి చేరు కున్నది. దీంతో ఒకనాటి స్వయంపోషక తెలంగాణ గ్రా మాలు రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారాయి. అందుకే తొంభైలలో మళ్లీ పురుడుపోసుకున్న ఉద్యమా నికి నీరే ప్రధాన ప్రాతిపదిక అయింది. తెలంగాణ భౌగో ళిక అనివార్యత గనుకనే టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణా ళికలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలుప రుస్తానని వాగ్దానం చేసింది. అధికారంలోకి రాగానే చెరువుల పునరుద్ధరణకు పూనుకుంది. ముఖ్యమంత్రి కేసీ ఆర్, సాగునీటి శాఖ పరిధిలో అనేక చర్చలు, సమీ క్షలు తర్వాతే మిషన్ కాకతీయ కార్యక్రమం సిద్ధమైంది. మిషన్ కాకతీయ కార్యక్రమం రూపొందిన ఈ పరి ణామక్రమంలో బిక్షం గారన్నట్లుగా పిసరంత భావుకత లేదు. ఇది ఉద్యమ ఆకాంక్షను వాస్తవికతగా మార్చడా నికి అకుంఠిత దీక్షతో ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ. గతంలో అమలైన పథకాలను సమీక్షించాలని ఆయన పేర్కొన్నారు. గతంలో అమలు చేసిన ఆర్ఆర్ పనులను, జైకా, ప్రపంచ బ్యాంకు పనులను నిత్యం సమీక్షిస్తూ గత లోపాలు పునరావృతంకాకుండా ఇంజనీ ర్లకు సూచనలు జారీచేస్తున్నాము. ‘నాటి చెరువునే కోరుకుంటున్నామంటే పెను మార్పులకు గురైన సమాజంలో మారిన ఆర్థిక వాస్తవిక తలో ఒక నిర్దిష్ట సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించ డానికి ప్రయత్నిస్తున్నామన్నమాట’ అని బిక్షంగారంటు న్నారు. నాటికీ, నేటికీ భూసంబంధాల్లో మార్పు వచ్చి నా, చెరువు యాజమాన్య పద్ధతులను ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్చుకునే అవసరాన్ని ప్రభుత్వం గుర్తిం చింది. చెరువు కాకుండా ఎలాంటి సాగునీటి వ్యవస్థను తెలంగాణలో పునరుద్ధరించాలో వ్యాసకర్త సెలవిస్తే బాగుండేది. ‘...చెరువులు పూడికతీత, తవ్వడం, కట్టలను, గట్ల ను బలోపేతం చేయడం, మూలజలాన్ని శుద్ధి చేయడం ద్వారా ఏదో జరిగిపోతుందని అనుకుంటే.. అమాయక త్వమే’ అని అంటున్నారు బిక్షంగారు. అంతర్జాతీయ జలనిర్వహణ నిపుణుడైన ఆయన ఇంత అమాయక సూత్రీకరణ చేయడమే ఆశ్చర్యకరం. చెరువున్న గ్రామా ల్లో, లేని గ్రామాల్లో తాగునీటి సమస్యపై తులనాత్మక అధ్యయన రికార్డులు భూగర్భ జలశాఖ వద్ద ఉన్నాయి. వాటిని ఎవరైనా పరిశీలించి నిర్ధారించుకోవచ్చు. దీనిపై బిక్షం గారి వ్యాఖ్య అభ్యంతరం, అశాస్త్రీయం కూడా. చివరగా.. ‘ఈ ప్రాజెక్టుల లక్ష్యసాధనలో ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రజలు సందేహిస్తున్నారు...’ అన్నారు. ప్రజలకేమో గానీ బిక్షంగారికే ఈ సందేహం ఉన్నట్లుంది. మొన్ననే సౌదీ నుంచి మోహన్ బానోత్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. సౌదీలో ఆయన డ్రైవర్‌గా వెయ్యి రియాళ్లకు (రూ.12,000లు) పనిచేస్తున్నాడు. తనది కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, నూకలమర్రి గ్రామం. ‘లొంక చెరువులకు నీల్లు వస్తే మా ఊల్లె యవుసం లేస్తది. మేమందరం మా ఊల్లెకు వాపసు వస్తం. ఊరికి దూరంగా, భార్యాపిల్లలకు దూరంగా బతుకుడు కష్టం గా ఉన్నది సారు. చెరువుల నీల్లుంటే మా ఊల్లెనే యవు సం చేసుక బతుకుతం సారు. మా ఊరి చెరువును బాగు చెయున్రి’ అని చెప్పినాడు. నా కండ్లు చెమ్మగిల్లినాయి. ఇలాంటి లక్షలాది వలస జీవులు గ్రామాలకు తిరిగివస్తే ఈ కార్యక్రమం జయప్రదం అయినట్లే. మిషన్ కాక తీయ మోహన్ బానోత్ లాంటి తెలంగాణ బిడ్డల కోస మే బిక్షంగారు. ఇది భావుకత కాదు. వాస్తవికతంగా మారబోతున్న తెలంగాణ ప్రజల పునర్ జ్ఞాపకం. (వ్యాసకర్త ఒ.ఎస్.డి, తెలంగాణ సాగునీటి శాఖ మొబైల్: 9491060585) శ్రీధర్‌రావు దేశ్‌పాండే