మాది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంట గ్రామం. రాష్ట్రంలో అపర భద్రాద్రిగా పేరు గాంచిన మా గ్రామానికి నలువైపులా నాలు గు చెరువులుండేవి. 40 ఏళ్ల క్రితం వరకూ ఇల్లంద కుంట సస్యశ్యామలంగా ఉండేది. మంచినీటి చేద బావుల్లో నీరు ముంచుకునేట్టుండేది. గ్రామానికి కల్పవృక్షం. కామధేను వులైన పుల్లాయకుంట, కుమ్మరికుంటలను భూకబ్జాదారులు ఆక్రమిం చుకున్నారు. అవి అదృశ్యం కావటంతో గ్రామంలో సాగునీరు, తాగు నీటి ఎద్దడి ఏర్పడింది. పచ్చని గ్రామం కళ తప్పింది. గుండ్ల చెరువు కింద 8 గ్రామాల రైతులు పంటలు పం డిస్తారు. గుండ్ల చెరువు పూడికను పాలకులు మరిచి పోయారు.
ఊర చెరువు కబ్జాకు గురైనా గత ప్రభుత్వాలకు పట్టలేదు. ఇల్లందకుంట ఊర చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కబ్జాకు గురైన చెరువులను విముక్తి చేసి, వెంటనే పునరుద్ధరించి తిరిగి గ్రామాన్ని సస్యశ్యామలం చేయాలి. సీఎం కేసీఆర్ ‘సాక్షి’ ఇన్‌బాక్స్ లేఖకు స్పందించడం గ్రేట్. ప్రతిరోజూ ఈ లేఖలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించాలి.
రావుల రాజేశం ఇల్లందకుంట, జమ్మికుంట, కరీంనగర్