రామాయణం ఎందుకు నిలబడిందంటే...
మానవాతీత వ్యక్తులను కాక, లేదా మానవుల వలె నటిస్తున్న మానవాతీత వ్యక్తులను కాక, మానవులై వుండి, కొన్ని ఆశా నిరాశలకు, రాగ ద్వేషాలకు, కష్ట సుఖాలకు, జయాపజయాలకు నా వలె, మీ వలె, మరొకరి వలె లోనైన వ్యక్తులను మాత్రమే పాత్రలనుగా తీసుకొని, వాల్మీకి తన మహాకావ్యాన్ని రచించాడు. ఆ పాత్రల స్వరూపాన్ని ప్రక్షిప్తాలెంతగా మరుగు పరుస్తున్నా, వాటిలోనుంచి మానవత తొంగి చూస్తూ వుంటుంది కనుకనే, మనలోని మానవతను ఆత్మబంధువు వలె ఆదరంగా అది పలకరిస్తూ వుంటుంది కనుకనే, ఇన్ని శతాబ్దాల తర్వాతైనా వాల్మీకి రచన తన సమ్మోహన శక్తిని కోల్పోలేదు!
(తన ఏకాంకిక ‘జాబాలి’కి నార్ల రాసుకున్న పీఠికలోంచి; సౌజన్యం: విశాలాంధ్ర)
నార్ల వెంకటేశ్వరరావు