అమరత్వానికి హెచ్చుతగ్గులుండవ్! | no difference to martyrs | Sakshi
Sakshi News home page

అమరత్వానికి హెచ్చుతగ్గులుండవ్!

Published Fri, Aug 21 2015 12:21 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

అమరత్వానికి హెచ్చుతగ్గులుండవ్! - Sakshi

అమరత్వానికి హెచ్చుతగ్గులుండవ్!

మావోయిస్టుల ఎజెండాయే మా ఎజెండా అని నమ్మబలికి నిన్నకాక మొన్న అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజా ఉద్యమాలను, ప్రజలను, ఉద్యమ కార్య కర్తలను హత్య చేయడమే ఎజెండాగా పెట్టుకున్నాడు. అధికారంలోకి వస్తే చాలు భూ సమస్యలను పరిష్కరి స్తానన్నవాడు నేడు పెట్టుబడిదార్ల పాలేగాడిగా మారి పోయి విదేశీ పెట్టుబడులకు, బహుళజాతి గుత్త సం స్థలకు ఎర్రతివాచీ పరిచి స్వాగతిస్తున్నాడు.

 ఆది వాసీల జీవనాన్ని విధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న ఖనిజసంపదను దోచుకోవడం కోసం సీఆర్‌పీ ఎఫ్, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలను ఉసిగొల్పుతూ ప్రభుత్వం పాల్పడుతున్న దమనకాండకు నిదర్శనమే లంకపల్లి హత్యాకాండ. లంకపల్లి బూటకపు ఎన్‌కౌం టర్‌లో అసువులు బాసిన వివేక్, (రఘు), కమల, సో నిల నగ్న హత్యపైకూడా దారుణమైన దుష్ర్పచారానికి పూనుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో విసుగు చెందిన కొంతమంది యూనివర్సిటీ విద్యార్థు లు విప్లవోద్యమంలో భాగస్వాములయ్యారని వార్త గుప్పుమనగానే తెలంగాణ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ లకు తెరదీసింది. అతి చిన్న వయస్సులో త్యాగానికి బాటలు పర్చిన వివేక్‌ను పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కుమ్మక్కై బలితీసుకొంది. పైగా చిన్న పిల్లలను సైతం మావోయి స్టుపార్టీ రిక్రూట్ చేసుకుం టోందంటూ దుష్ర్పచారం మొదలెట్టింది. కానీ ప్రజా యుద్ధంలో అమరత్వానికి హెచ్చుతగ్గులు ఉండవు.

 లంకపల్లి బూటకపు ఎన్‌కౌంటర్లో అసువులు బాసిన వివేక్ (రఘు) వివరాలను ఫేస్‌బుక్‌ల్లోనూ, వాట్సప్‌ల్లోను చూస్తున్న ప్రతి ఒక్కరూ నేడు మావో యిస్టు పార్టీ రిక్రూట్‌మెంట్ విధానంపై చ ర్చిస్తున్నారు. కానీ గమనించాల్సింది ఏమిటంటే విప్లవ పదజా లాన్ని వాడుతూ, మాటలతోనే విప్లవాన్ని వల్లించేవాళ్ల ఆచరణ లేని విధానాన్ని గేలిచేస్తూ వివేక్, సోని, కమల వంటి వాళ్లు విప్లవంలోకి వచ్చారు. కాని వివేక్ తొందరపడ్డాడనీ, పరిణతి లేదనీ, ఆవేశంతో, దుందు డుకు స్వభావం కలవాడని సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారు. కమల, సోని, వివేక్ వం టి పసిమొగ్గలను పాశవికంగా చిదిమేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించని వాళ్లు చిన్నవయస్సు వాళ్లను రిక్రూట్ చేసు కుంటోందంటూ మావోయిస్టు పార్టీని తప్పుబట్టటం పాలక వర్గాలకు అంతిమంగా వంతపాడటమే.

 నేడు జనతన సర్కార్లు ఏర్పాటు చేస్తున్న ఛత్తీస్ గఢ్, బిహార్, జార్ఖండ్‌లలో పసిపిల్లలను, వృద్ధులను, మహిళలను నిరాయుధులైన అనేకమంది పీడిత ప్రజ లను రోజువారీగా హత్య గావిస్తూనే ఉన్నారు. ఈ హత్యలను, ప్రభుత్వాల పాశవిక దమనకాండను మేధావులు ఎందుకు ఖండించడం లేదన్నది మా ప్రశ్న. ఆదివాసుల జీవన విధానం ఒక రణరంగమై, వారి బతుకులు ఛిద్రమై, ఇళ్లు ధ్వంసమై, హంతక బల గాలు ఆదివాసీల ఆస్తుల్ని ధ్వంసం చేసి, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుంటే రాజ్యాన్ని ప్రశ్నించేం దుకు ఏ మేధావి గొంతూ పెగలడం లేదు.

ప్రాణత్యా గం చేస్తున్న అమరులను అవమానించేలా మాట్లా డటం అంటే వారి త్యాగాలను కించపర్చడమే. అం దుకే మేధావులను సరిగ్గా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. విప్లవకారుల త్యాగాలపై దుష్ర్పచారా న్ని నమ్మవద్దని అభ్యర్థిస్తున్నాం. ప్రజా రాజ్యాధికారం రావాలంటే సాయుధ పోరాటమే మార్గం. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల నెత్తుటి సాక్షిగా తెలం గాణలో విప్లవోద్యమం ఫీనెక్స్ పక్షిలాగా తిరిగి ఉవ్వె త్తున ఎగిరేలాగా పుంజుకునేలా నిర్మిద్దాం. పసివయ స్సులోనే ప్రజల కోసం అసువులు బాసిన వివేక్ వంటి వారి త్యాగానికి అదే సరైన నివాళి.
వ్యాసకర్త: జగన్  తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, సి.పి.ఐ. (మావోయిస్టు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement